అమెరికాకు(USA) వెళ్లి చదువుకోవాలని భావించే వారు స్టూడెంట్ వీసా(Student Visa) కోసం అప్లై(Apply) చేసుకోవాలి. అయితే ఈ విషయంలో వారికి చాలా సందేహాలు ఉంటాయి. స్టూడెంట్ వీసా(Student Visa) ప్రక్రియ ఇంటర్నేషనల్ విద్యార్థులకు కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌కు(United States) అనుకొన్న సమయానికి ప్రయాణం ప్రారంభించేందుకు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. వీసాకి అప్లై(Visa Apply) చేయడానికి ఏ ఫారమ్‌లు అవసరం? వీసా కోసం ఎంత ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చు? యునైటెడ్ స్టేట్స్‌లో(United States) ఉన్నప్పుడు తీసుకోవలసిన చర్యలు ఏంటి..? వంటి ప్రశ్నలకు నిపుణుల వివరాలు తెలుసుకోండి.
స్టూడెంట్ వీసా ప్రక్రియను ఎలా ప్రారంభించాలి?
ముందు యునైటెడ్ స్టేట్స్‌లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్(SEVP-Student and Exchange Visitor Program) సర్టిఫైడ్ స్కూల్‌కి దరఖాస్తు చేసుకోవాలి. స్కూల్ సెర్చ్ టూల్‌ను ఉపయోగించి F-1, M-1 విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడానికి SEVP సెర్టిఫైడ్ స్కూల్స్, ప్రోగ్రామ్‌లను సెలక్ట్ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Education USA వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
I-20 అంటే ఏంటి?
SEVP సెర్టిఫైడ్ స్కూల్‌లో అడ్మిషన్ లభించిన తర్వాత.. సంబంధిత స్కూల్ నుంచి అధికారి ఫారమ్ I-20 పంపుతారు. దాన్ని సెర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్‌గా పేర్కొంటారు. ఫారమ్ I-20 అనేది స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) డేటాబేస్‌లోని విద్యార్థి సమాచారానికి సంబంధించిన రికార్డ్. అడ్మిషన్ పొందిన ప్రతి స్కూల్ ఫారమ్ I-20ని మెయిల్ చేస్తుంది.
SEVIS అంటే ఏంటి?
SEVIS అనేది యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న సమయంలో నాన్‌ఇమిగ్రెంట్ స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్స్ సమాచారాన్ని నిర్వహించడానికి ఉపయోగించే వెబ్ బేస్డ్ సిస్టమ్.
I-901 SEVIS ఫీజును ఎలా చెల్లించవచ్చు? ఫీజు ఎంత?
ఫారమ్ I-20ని స్వీకరించిన తర్వాత, తప్పనిసరిగా I-901 SEVIS ఫీజును చెల్లించాలి. SEVIS ఫీజులు ప్రోగ్రామ్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కానీ చాలా మంది విద్యార్థులు F1 కోసం 350 డార్లు, J1 కోసం 220 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫెడరల్ నిబంధనల ప్రకారం అన్ని F, M, J విద్యార్థులు U.S. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు I-901 SEVIS ఫీజును చెల్లించాలి. I-901 SEVIS ఫీజును FMJfee.comలో ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. లేదా Western Union క్విక్ పేని ఉపయోగించి చెల్లించవచ్చు.వీసా దరఖాస్తు చేసినప్పుడు ఫీజు చెల్లించిన రసీదును సమర్పించాలి. I-901 SEVIS రుసుము రసీదులోని SEVIS ID నంబర్ ఫారమ్ I-20లోని మీ SEVIS ID నంబర్‌తో సరిపోలాలి.
ప్రోగ్రామ్ ప్రారంభమయ్యే తేదీకి ఎంత ముందుగా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు?
I-20 ఫారమ్‌లో పేర్కొన్న ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 120 రోజుల ముందు స్టూడెంట్ వీసా జారీ చేయవచ్చు.
ఎప్పుడు ఎక్కువ స్టూడెంట్ వీసా అపాంట్‌మెంట్‌లు ఓపెన్ అవుతాయి?
ఇండియాలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు 2021-2022 వింటర్ స్టూడెంట్ సీజన్‌లో రికార్డు స్థాయిలో విద్యార్థులను ఇంటర్వ్యూ చేశాయి. స్ప్రింగ్(వసంతకాలం) వరకు తక్కువ సంఖ్యలో విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తారు. విద్యార్థులు వారి I-20లను స్వీకరించడం ప్రారంభంకావడంతో 2022 స్ప్రింగ్, వేసవిలో ఎక్కువ ఇంటర్వ్యూలు జరుగుతాయి. మీ I-20ని స్వీకరించిన తర్వాత అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేసుకోవడం మేలు.
స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌కు ఏవి అవసరం?
ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ సమయంలో.. DS-160: ఆన్‌లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ బార్‌కోడ్ పేజ్, ఫారమ్ 1-20, ఫోటో, పాస్‌పోర్ట్, దరఖాస్తు ఫీజు చెల్లింపు రసీదు, అకడమిక్ ప్రిపరేషన్ డాక్యుమెంట్‌లు, యూఎస్ స్కూల్‌కు అవసరమైన ప్రామాణిక పరీక్ష స్కోర్‌లు, యూఎస్‌కు వెళ్లడానికి కారణాలు, యూఎస్‌లో చదువుకొనేందుకు, అవసరాలకు, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన వివరాలు అవసరం.
30 రోజుల కంటే ముందుగా యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించవచ్చా?
F లేదా M వీసాలపై ఉన్న విద్యార్థులు ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందుగా యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందుగా నమోదు చేయాలనుకుంటే, విడిగా దరఖాస్తు చేసుకోవాలి. విజిటర్స్ (B) వీసా కోసం అర్హత పొందాలి. U.S. కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారుల ద్వారా విజిటర్స్(B) వీసా హోదాలో యూఎస్‌లో అడుగు పెట్టిన తర్వాత స్టూడెంట్‌గా స్టేటస్ మార్చుకోవడానికి U.S.సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీస్(USCIS)కు విడిగా దరఖాస్తు చేయాలి.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) అంటే ఏమిటి?
F-1 స్టూడెంట్స్‌కు తాత్కాలిక ఉపాధికి సంబంధించింది ఆప్షనల్‌ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT). అర్హతగల విద్యార్థులు తమ చదువును పూర్తి చేయడానికి ముందు లేదా పూర్తి చేసిన తర్వాత 12 నెలల వరకు OPT ఉపాధి అధికారాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. OPTకి ముందు ఉన్న సమయం, పూర్తయిన తర్వాత OPT అందుబాటులో ఉన్న కాలం నుంచి తీసివేస్తారు.
OPTలో విద్యార్థిగా ఎలా పని చేయాలి?
OPT ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు తప్పనిసరిగా OPT కోసం ఫారమ్ I-20 అవసరం. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(EAD) కోసం USCISకి దరఖాస్తు చేసుకోవాలి. OPT గురించి మరింత తెలుసుకోవడానికి, USCIS వెబ్‌సైట్, ICE ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెబ్‌పేజీని సందర్శించండి. ఇప్పటికే అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన పూర్వ విద్యార్థుల సలహాలు, సూచనలు కూడా చాలావరకు ఉపయోగపడతాయి.
ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Study, USA, Visa