Home /News /jobs /

HOW TO GET A SEAT AT NITS IITS BASED ON JEE SCORE WHAT IS JOSAA CSAB COUNSELLING PROCESS UMG GH

IIT Counseling: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో అడ్మిషన్స్ కావాలా..? కౌన్సెలింగ్‌ని ఇలా ఫేస్ చేయండీ..!

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో అడ్మిషన్స్ కావాలా..?

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో అడ్మిషన్స్ కావాలా..?

ఐఐటీ (IIT)లు, ఎన్‌ఐటీ (NIT)లు, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ(JoSAA), సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (CSAB) చేపట్టనున్నాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ చేపడుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జేఈఈ మెయిన్-2022 (JEE Mains) రిజల్ట్స్ ఇటీవల విడుదలయ్యాయి. 2.5 లక్షల లోపు ర్యాంకు సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం ఆగస్టు 11లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ(JoSAA), సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (CSAB) చేపట్టనున్నాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ చేపడుతుంది. అలాగే ఎన్‌ఐటీ, ఐఐఐటీ‌ల కోసం కూడా కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇక, ఎన్‌ఐటీ+ సిస్టమ్‌లోని అదనపు సీట్లకు సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు(CSAB) కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.

జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ... కౌన్సెలింగ్‌ను ఆరు రౌండ్లలో నిర్వహించనుంది. ఇక్కడ విద్యార్థులకు వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్లు కేటాయిస్తారు. సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు(CSAB) తన సొంత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మిగిలిన సీట్ల కోసం రెండు ప్రత్యేక కౌన్సెలింగ్ రౌండ్‌లను నిర్వహించనుంది.

ఇదీ చదవండి: అబ్బా .. ఇది కదా ఆఫర్ అంటే.. గేమింగ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్..!


“JoSAA-2022 ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 2022-23 అకడమిక్ సెషన్ కోసం ఐఐటీలు, ఎన్‌ఐటీ+ సిస్టమ్‌ల్లో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్/టెక్నాలజీ, ఆర్కిటెక్చర్/ప్లానింగ్ ప్రోగ్రామ్‌ల కోసం అభ్యర్థులకు ఉమ్మడిగా ప్రవేశాలను కల్పించనుంది. JoSAA కౌన్సెలింగ్ ఆరు రౌండ్లు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత, NIT+ సిస్టమ్‌లో ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే (ఐఐటీల సీట్లు మినహా), CSAB రెండు ప్రత్యేక రౌండ్‌లను సొంత ఆన్‌లైన్ పోర్టల్ csab.nic.in ద్వారా నిర్వహిస్తాం.’’ అని సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (CSAB) తన వెబ్‌సైట్‌లో అధికారికంగా పేర్కొంది.

సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు.. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ & నికోబార్, డామన్ & డయ్యూ, లక్షద్వీప్, దాద్రా & నగర్ హవేలీలలోని ఎంపిక చేసిన NITల్లో సూపర్‌న్యూమరీ సీట్లలో అడ్మిషన్లు కల్పించడానికి ప్రత్యేక CSAB-సూపర్‌న్యూమరరీ రౌండ్‌ను నిర్వహిస్తుంది. ఇక, ఈశాన్య రాష్ట్రాలు, యూటీలకు చెందిన అభ్యర్థులకు సీట్లను కేటాయించడానికి CSAB-NEUT రౌండ్‌లను కూడా నిర్వహిస్తుంది. స్టేట్/ యూటీలలో ఏఐసీటీఈ ఆమోదించిన ఇన్‌స్టిట్యూట్‌లలో డిగ్రీ స్థాయి సాంకేతిక కోర్సుల్లో సీట్ల రిజర్వేషన్ స్కీమ్ కింద ఈ CSAB-NEUT రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది.



కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్‌లు ఆగస్టు 23 నాటికి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష ఆగస్టు 28న కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరగనుంది. రెండు లాంగ్వేజ్‌‌లైన హిందీ, ఇంగ్లిష్‌లో మొత్తంగా ఆరు గంటల పాటు పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏడాది మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఉండవచ్చు. మార్కింగ్ స్కీమ్ వివరాలు ‘ఇన్‌స్ట్రక్షన్ టూ క్యాండిడేట్స్’ సెక్షన్‌లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే మూడు భాగాలు ఉంటాయి.
Published by:Mahesh
First published:

Tags: IIT, Jee mains 2022, JOBS, Nit

తదుపరి వార్తలు