Home /News /jobs /

HOW TO GET A GOOD SCORE IN TS EAMCET 2022 FOLLOW THESE TIPS KNOW FULL DETAILS HERE VB NZB

TS EAMCET 2022 Preparation Tips: ఎంసెట్ లో మంచి స్కోర్ సాధించడం ఎలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఎంసెట్ లో మంచి మార్కులు సంపాదించాలంటే ఓ ప్లానింగ్ ప్ర‌కారంగా చ‌దువుకోవాల‌ని  నిజామాబాద్ సీనియర్ మోస్టు ప్యాకాల్టీ ఐఐటి, నీట్ పౌండేష‌న్ రాంచంద‌ర్ త‌న అనుభంలో టిప్స్ చెప్పారు.

    (పి మహేందర్, నిజామాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)

    ఎంసెట్ లో(Eamcet) మంచి మార్కులు సంపాదించాలంటే ఓ ప్లానింగ్(Planning) ప్ర‌కారంగా చ‌దువుకోవాల‌ని  నిజామాబాద్ సీనియర్ మోస్టు ప్యాకాల్టీ ఐఐటి, నీట్ పౌండేష‌న్ రాంచంద‌ర్ త‌న అనుభంలో టిప్స్(Tips) చెప్పారు. ఎంసెట్ లో మొత్తం 160 మార్కులకు mathematics స‌బ్జెక్ట్  నుంచి 80 మార్కులు.. పీజిక్స్(Physics) స‌బ్జెక్ట్ నుంచి 40 మార్కులు, కెమిస్ట్రీ(Chemistry) స‌బ్జెక్ట్ నుంచి 40 మార్కులు ఉంటాయి. అయితే  80 మార్కులు ఒక్క గ‌ణితం నుంచి సంప‌దించుకోవ‌చ్చు.     ఎంసెట్ లో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే కచ్చితంగా గ‌ణితం నుంచే సాద్య‌మవుతుంది.  ప్రతి చాప్టర్ నుంచి ఒకటి లేదా రెండు ప్ర‌శ్నలు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఇంట‌ర్ , మొద‌టి సంవ‌త్స‌రం, రెండ‌వ సంవ‌త్స‌రంలో 30 శాతం సెల‌బ‌స్ తొల‌గించారు. దీంతో మరింత సులువు అవుతుంది. మేజ‌ర్ టాఫిక్స్ నుంచే కొష‌న్స్ వ‌చ్చే ఆవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

    myAvtar Job Fair: మహిళల కోసం ‘మై అవతార్(myAvtar)’ జాబ్ ఫెయిర్.. దరఖాస్తు, పూర్తి వివరాలిలా..


    ఆ ప‌ద్ద‌తిలో చ‌దువుకుంటే మంచి స్కోర్ చేయ‌వ‌చ్చు. అయితే మనకు ఫస్ట్ ఇయర్.. సెకండ్ ఇయ‌ర్ లో 50 టాఫిక్స్ ఉన్నాయి.. ఫస్ట్ ఇయర్ ఆల్జీబ్రా, జామెట్రీ ..  సెకండ్ ఇయర్ ఆల్ జిబ్రా , క్యాలిక్ లేస్ తీసుకున్నట్లయితే మొత్తంగా యావరేజ్ 45 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి.  ప్ర‌తి టాఫిక్ నుంచి ఒక‌టి రెండు ప్రశ్నలు ఇస్తారు.. వీటిని త‌ప్ప‌ని స‌రిగా చ‌దువుకోవాలి. మేజర్ టాపిక్స్ తీసుకుంటే.. వాటి నుంచే ఎక్క‌వ ప్రశ్నలు వ‌చ్చే ఆవ‌కాశం ఉంది.. ఆల్జీబ్రా తీసుకున్నట్లయితే.. ఆల్జీబ్రా లో ఫంక్షన్స్ వెక్ట్రాల్ జిబ్రా,   ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్,  కాంప్లెక్స్ నంబర్స్ అండ్ సెకండ్ ఇయ‌ర్..  ఆ తర్వాత ప్రాబబిలిటీ తర్వాత సెర్కిల్స్,  ఇండిపెండెంట్ ఇంటిగ్రేషన్,  ఈ ఆరు ఏడు టాపిక్స్ నుంచి మొత్తంగా 30 నుంచి 35 ప్ర‌శ్నలు రావ‌చ్చు.. ఫంక్షన్ టాపిక్.. రోమన్ రైమ్స్.. నెంబర్ ఆఫ్ ఫంక్షన్ వీటి నుంచి ఎక్కువ మార్చులు వచ్చే అవకాశం ఉంది.



    అడిషనల్ విట్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇందులో  మూడు ఫార్ములాలు ఉంటాయి.. వాటిని గుర్తు పెట్టుకుంటే వాటిసి సులువుగా ఆన్స‌ర్ చేయ‌వ‌చ్చు.  రియల్ పార్ట్.. ఇమ్యాజునరి పార్ట్ లోనుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.  ప్రతి ఏడూ ఇందులో నుంచీ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.. వీటి పై దృష్టి పెట్టాలి.. మొత్తంగా 80 ప్రశ్నలకు ఒక గంటలో ఆన్సర్ చేయగలిగితే గణితం నుంచి 60 మార్కులు.. పీజిక్స్ నుంచి 20 మార్కులు..  కెమిస్ట్రీ నుంచి మ‌రో 20 మార్కులు సాదిస్తే వంద మ‌ర్కులు  వ‌స్తే  10 వేల ర్యాంకు వస్తుంది.

    SIDBI recruitment 2022: రూ.70,000 వేతనంతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు

    దీంతో మంచి ప్ర‌భుత్వ కాలేజిలో సీటు సంపాదించుకోవచ్చన్నారు.  అదే  120 మార్కులు సంపాదిస్తే  టాఫ్ టెన్ కాలేజీలో సీటు కన్ఫామ్ అవుతుంది.. ఈ రకంగా ప్ర‌తి టాఫిక్ ను విశ్లేష‌నాత్మకంగా  చ‌దువుకుంటే మీరు కోరుకున్న కాలేజీలో సీటు సంప‌దించుకోవచ్చ‌ని ఆయ‌న విద్యార్థుల‌కు వివ‌రించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, JOBS, TS EAMCET 2021

    తదుపరి వార్తలు