Home /News /jobs /

HOW TO DOWNLOAD JEE MAIN ADMIT CARD AND WHAT TO CHECK UMG GH

JEE Main: జేఈఈ అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఇంకా ఏమేం చెక్ చేసుకోవాలంటే..?

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విధానం.

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విధానం.

జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను (JEE) నిర్వహిస్తుంది. ఈ ఏడాది జేఈఈ సెషన్-1 పరీక్షలు జూన్ 23 నుంచి జూన్ 29 వరకు జరగనున్నాయి. అయితే అభ్యర్థులు అడ్మిట్ కార్డు (Admit Card) జారీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో Engineering ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది JEE సెషన్-1 పరీక్షలు జూన్ 23 నుంచి జూన్ 29 వరకు జరగనున్నాయి. అయితే అభ్యర్థులు అడ్మిట్ కార్డు జారీ కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం.. ఎన్‌టీఏ జూన్ 11న అడ్మిట్ కార్డును జారీ చేయాల్సి ఉంది. అయితే ఆలస్యానికి గల కారణాలను ఏన్‌టీఏ వెల్లడించలేదు. ఆడ్మిట్ కార్డు జారీ అయిన తరువాత అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ సెషన్-1: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ విధానం
స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in‌ను సందర్శించాలి.
స్టెప్-2: హోమ్ పేజీలో సెషన్ -1 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని ఉపయోగించి అభ్యర్థులు లాగిన్ అవ్వాలి.
స్టెప్-4: ఆ తరువాత జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
స్టెప్-5: అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ఫ్రింట్ ఔట్ తీసుకోవాలి.

ఇదీ చదవండి: వర్క్‌ఫ్రమ్ హోమ్‌కే ఐటీ ఉద్యోగుల మొగ్గు.. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు


అడ్మిట్ కార్డులో పరిశీలించాల్సిన అంశాలు
జేఈఈ మెయిన్ Admit Card జారీతో పరీక్ష కేంద్రం, సమయం, స్లాట్‌తో సహా ఇతర వివరాలను అభ్యర్థులు తెలుసుకుంటారు. అలాగే అడ్మిట్ కార్డులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అడ్మిట్ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి. లేకపోతే అభ్యర్థులకు పరీక్ష హాలులోకి ప్రవేశం ఉండదు. ప్రధానంగా అడ్మిట్ కార్డులో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, స్పెల్లింగ్, పరీక్ష తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పరీక్షకు ముందు, తరువాత అభ్యర్థులు ఎలా వ్యవహరించాలనే సూచనలు ఉంటాయి.

పరీక్ష నగరాల సెంటర్స్ జాబితా విడుదల
JEE మెయిన్ పరీక్ష దేశవ్యాప్తంగా 501 నగరాల్లో, విదేశాల్లో 22 నగరాల్లో జరగనుంది. విద్యార్థులు పరీక్షలు జరిగే నగరాలకు చేరుకోవడం కోసం అవసరమైన ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి జూన్ 14న ఎన్‌టీఏ, పరీక్ష నగరాల సెంటర్ల జాబితాను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలు మొత్తం రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ జూన్ 23 నుంచి జూన్ 29 వరకు, రెండో సెషన్ జూలై 21 నుంచి జూలై 30 వరకు జరగనున్నాయి.



జేఈఈ మెయిన్ -2022 మార్పులు
ఈ ఏడాది పరీక్ష కేంద్రాలు మొదలుకొని టై-బ్రేకింగ్ పాలసీ వరకు అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. జేఈఈ మెయిన్ -2022 కోసం టై-బ్రేకర్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. టై అయిప్పుడు విద్యార్థుల స్కోర్‌ను బ్రేక్ చేయడానికి గతంలో ఉన్న విధానాన్ని ఎన్‌టీఏ తిరిగి తీసుకొచ్చింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులను స్కోర్ చేసినప్పుడు.. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా నెగెటివ్ మార్కింగ్‌మార్కులతో సహా ఇతర మార్గాల ద్వారా టై పరిష్కరించలేకపోతే, JEE మెయిన్‌కు ముందు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వయసు నిబంధనలను ఈసారి అమలు చేయనున్నారు.

అలాగే JEE మెయిన్ 2022లో రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నారు. అదే 2020లో కరోనా కారణంగా నాలుగు సెషన్లలో నిర్వహించారు. అంతకు ముందు JEE మెయిన్‌కు కేవలం ఒక సెషన్ మాత్రమే ఉండేది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Jee, Jee mains 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు