హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Preparation: జేఈఈ, నీట్, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టిప్స్.. టైంటేబుల్‌ క్రియేట్ చేయండిలా..

Exam Preparation: జేఈఈ, నీట్, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టిప్స్.. టైంటేబుల్‌ క్రియేట్ చేయండిలా..

కరోనా సమయంలో విద్యార్థులు హాజరయ్యే అన్ని ఎగ్జామ్స్ (exams) కోసం సక్రమంగా ప్రిపేర్ కావాలి. ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి.

కరోనా సమయంలో విద్యార్థులు హాజరయ్యే అన్ని ఎగ్జామ్స్ (exams) కోసం సక్రమంగా ప్రిపేర్ కావాలి. ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి.

కరోనా సమయంలో విద్యార్థులు హాజరయ్యే అన్ని ఎగ్జామ్స్ (exams) కోసం సక్రమంగా ప్రిపేర్ కావాలి. ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి.

  కరోనా (corona) సమయంలో విద్యార్థులు బోర్డు పరీక్షలతో పాటు పోటీ పరీక్షలు సన్నద్ధం కావడం సవాలుగా మారింది. ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామ్స్‌తో పాటు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ - JEE) మెయిన్ 2022, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ - NEET) 2022 వంటి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా కీలకంగా మారనుంది. కరోనా సమయంలో విద్యార్థులు హాజరయ్యే అన్ని ఎగ్జామ్స్ (exams) కోసం సక్రమంగా ప్రిపేర్ కావాలి. ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి. కాబట్టి విద్యార్థులు చక్కటి టైంటేబుల్ (time table) ఫాలో కావలసి ఉంటుంది. అలాగే కొన్ని టిప్స్ ఫాలో కావడం ద్వారా అన్ని పరీక్షలలో మంచి మార్కులు (good score) సాధించడం సులభతరమవుతుంది. ఆ టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  బోర్డు పరీక్షలు vs ప్రవేశ పరీక్షలు..

  నివేదికల ప్రకారం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ (JEE) మెయిన్స్‌ను ఫిబ్రవరి 2022 నుంచి నాలుగు సెషన్లలో మే 2022 వరకు షెడ్యూల్ చేయవచ్చు. జేఈఈ వేగంగా సమీపిస్తున్నందున విద్యార్థులు బోర్డు పరీక్షల కోసం సీబీఎస్‌ఈ ప్రిపరేషన్ పక్కన పెట్టాలని అనుకుంటారు. అయితే ప్రవేశ పరీక్షలలో మంచి స్కోర్ సాధించాలంటే సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ కోసం చక్కగా ప్రిపేర్ కావడం కూడా చాలా ముఖ్యమని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.

  IGNOU: ఇగ్నో జనవరి 2022 సెషన్ రీ-రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే..


  బోర్డు పరీక్షల్లో విద్యార్థులు 5- మార్కుల, 10-మార్కుల ప్రశ్నలకు కాన్సెప్షనల్ ఆన్సర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ కి చక్కగా ప్రిపేర్ కావడం ముఖ్యం. మరోవైపు ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పై దృష్టి పెట్టాలి. రెండింటి మధ్య సమతుల్యతను సాధించడానికి, ప్రవేశ పరీక్ష ప్రిపరేషన్‌లో బోర్డు ప్రిపరేషన్ ఏకీకృతం చేయడం అవసరం.

  బోర్డులు, జేఈఈ, నీట్ ప్రిపరేషన్ టిప్స్

  నోట్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి..

  ముఖ్యమైన కాన్సెప్ట్‌లను గుర్తుపెట్టుకునే సమయంలో విద్యార్థులు ముఖ్యమైన పదజాలం (terminologies) కోసం నోట్స్, పాయింటర్‌లను మెయింటైన్ చేయాలి.

  స్మార్ట్ టైమ్ కేటాయింపు..

  రెండు పేపర్ ప్యాటర్న్‌ల కోసం సమయాన్ని కేటాయించడం ముఖ్యం. బోర్డ్‌ ఎగ్జామ్స్ కోసం థర్మోడైనమిక్స్ అధ్యాయాన్ని ఒక గంట పాటు అధ్యయనం చేస్తే, వెంటనే ఎంసీక్యూ (MCQ)లకు 10 నిమిషాల సమయం ఇస్తే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవచ్చు.

  HPCL Recruitment 2022: విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

  మాక్ టెస్ట్‌లు కీలకం..

  విద్యార్థులు తమ ప్రిపరేషన్ లెవెల్ అంచనా వేయడంలో మాక్ టెస్ట్‌లు సహాయపడతాయి. అలాగే, విద్యార్థులు తమ సమయాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేయడంలో తోడ్పడతాయి.

  గత ప్రశ్న పత్రాలు..

  అడిగే ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిష్కరించడం గొప్ప మార్గం.

  ఎగ్జామ్ ప్యాట్రన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం

  జేఈఈ (JEE) ఫిబ్రవరి 2022 సెషన్ వేగంగా సమీపిస్తున్నందున, విద్యార్థులు క్వశ్చన్స్ ప్యాటర్న్‌తో అప్‌డేట్ అవ్వాలి. తాజా అప్‌డేట్‌ల ప్రకారం, 2021లో జేఈఈ మెయిన్‌లో ప్రశ్నల సంఖ్యను 90కి పెంచగా... వాటిలో 75 ప్రయత్నించాల్సి ఉంది. అదేవిధంగా నీట్ 200 ప్రశ్నలను కలిగి ఉంటుంది, ఇందులో విద్యార్థులు 180 ప్రశ్నలకు సమాధానమివ్వాలి.

  ఈ ఏడాది కూడా జేఈఈ మెయిన్ 2022 (JEE Main 2022) పరీక్షను రెండు భాగాలుగా నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (BE) బీటెక్ (Btech)లలో ప్రవేశాల కోసం పార్ట్ 1.... బీఆర్క్‌ (BArch), బీప్లానింగ్‌ (BPlan) కోసం పార్ట్ 2.. పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ విధానం కొనసాగుతుంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.

  కటాఫ్ ట్రెండ్‌లు, ముఖ్యమైన అంశాలు

  కటాఫ్ ట్రెండ్‌లు అనేవి స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఎక్కువ కటాఫ్స్ వల్ల విద్యార్థులు బాగా స్కోరింగ్ కోసం తమకు మంచి పట్టున్న క్వశ్చన్స్ సాల్వ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. జేఈఈ మెయిన్స్‌కు గత ఏడాది కటాఫ్ 87.899 కాగా, నీట్‌కు కటాఫ్ 50 పర్సంటైల్‌గా ఉంది. విద్యార్థులు థర్మోడైనమిక్స్, కైనమాటిక్స్ (గతి శాస్త్రం- kinematics), లాస్ ఆఫ్ మోషన్స్ చాప్టర్లపై మంచి పట్టు సాధించాలి. నీట్ కోసం బయోలజీలోని జీవావరణ శాస్త్రం (Ecology), పర్యావరణం (environment), మొక్కలు (plants), జంతు శరీరధర్మ శాస్త్రం (animal physiology) వంటి ప్రాథమిక అంశాలపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. కటాఫ్ ట్రెండ్‌లు, పేపర్ ప్యాటర్న్‌లు, ప్రో-టిప్‌లతో అప్‌డేట్ అవ్వడమనేవి పరీక్షకు సిద్ధం కావడానికి ఉత్తమ మార్గాలని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి.

  First published:

  Tags: Career and Courses, JEE Main 2021

  ఉత్తమ కథలు