Home /News /jobs /

HOW TO BE ACTIVE DURING EXAMS HERE ARE SOME SUGGESTIONS FROM EXPERTS BA

Exam Tips | పరీక్షల సమయంలో ఇలా చురుగ్గా ఉండండి....

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొన్ని రకాల ఆహారాలు మెదడులో చురుకుదనాన్ని పెంచుతాయని చెబుతున్నారు. వాల్ నట్ తింటే చాలు మీ మెదడు కణాల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది.

    (డా.ప్రభు కుమార్, ప్రముఖ వైద్య నిపుణులు)

    పరీక్షల సమయంలో విద్యార్థులు చురుగ్గా ఉండడం చాలా అవసరం. మానసికంగా ఆనందంగా ఉంటేనే ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోగలుగుతాం అంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి ప్రణాళిక అలవరుచుకుంటే మంచి విజయాలు సాధించొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. దీంతో పాటు చురుకుదనాన్ని పెంచుకుని పట్టుదలతో చదివితే విజయం మీ సొంతమే అంటున్నారు.

    1. కొన్ని రకాల ఆహారాలు మెదడులో చురుకుదనాన్ని పెంచుతాయని చెబుతున్నారు. వాల్ నట్ తింటే చాలు మీ మెదడు కణాల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది.

    2. ఎక్కువగా ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాలతో ఉండకపోవడం మంచిది. ఇవి మీ మెదడు చురుకుదనాన్ని తగ్గిస్తాయి. మెదడు చురుగ్గా లేకపోతే ఏ పనీ మీరు చేయలేరు.

    3. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉండడం చాలా అవసరం. అనవసరమైన అంశాలపై మనసు కేంద్రీకరిస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండలేం. ఈ సమయంలో స్నేహితులతో గొడవలు పడడం, అనవసరమైన అంశాలపై చర్చలు చేయవద్దు.

    4. విద్యార్ధులు చురుగ్గా ఉండడానికి మరో ప్రధానమైన అంశం సరిపడినంత నిద్ర. ఎక్కువ చదివేయాలనే తపనతో సరిగ్గా పడుకోకుండా ఉండకూడదు. కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం.

    స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

    (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Exam Tips, Exams, Ssc exams

    తదుపరి వార్తలు