EAMCET 2020 : ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే.. వివరాలివీ..

EAMCET 2020 : ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌తో పాటు పలు కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

news18-telugu
Updated: February 21, 2020, 7:09 AM IST
EAMCET 2020 : ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే.. వివరాలివీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TS EAMCET 2020 : ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌తో పాటు పలు కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ రెండు పరీక్షలూ రాసే ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.800, ఇతర విద్యార్థులకు రూ.1600 నిర్ణయించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 6వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 13 వరకు, రూ.5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 20 వరకు, రూ.10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. కాగా, మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే సవరణలకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎంసెట్‌ను మే 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మే 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్ష, మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష నిర్వహించనున్నారు. అటు.. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ముందు జాగ్రత్తగా ఎంసెట్‌ దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థుల కోసం ప్రత్యేక కాలమ్‌ను పొందుపరిచారు. అర్హత ఉన్న విద్యార్థులు ఆ కోటాలో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు