హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Constable Exam: కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచన.. పరీక్ష హాల్లో ఇలా ఉండండి..

TSLPRB Constable Exam: కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచన.. పరీక్ష హాల్లో ఇలా ఉండండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్షకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు జరగనున్న ఈ పరీక్ష మొత్తం 1601 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్షకు(Constable Exam) రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు జరగనున్న ఈ పరీక్ష మొత్తం 1601 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. సివిల్‌ కానిస్టేబుల్‌ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు 6.61 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకాలు కోసం పరీక్ష జరుగుతోంది. ఒక్క నిమిషం(One Minute) ఆలస్యం అయినా సెంటర్లోకి అనుమతి ఉండదని అధికారులు సూచిస్తున్నారు. నేడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు(Recruitment Board) పూర్తి చేసింది.


Easy To Get 60 Marks: 60 మార్కులు తెచ్చుకోవడం ఇంత సులువా.. కానిస్టేబుల్ కు ఈ ఒక్క స్ట్రాటజీ చాలు.. 60 మార్కులు వచ్చినట్లే..


అభ్యర్థుల్ని గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను గుర్తించేందుకు బయోమెట్రిక్‌ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారని, పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు తెలిపారు. చేతులకు గోరింటాకు, మేహందీ వంటివి పెట్టుకుంటే బయోమెట్రిక్‌లో వేలిముద్రలు గుర్తించే అవకాశం ఉండదని.. వాటిని పెట్టుకొని రావద్దని అన్నారు.అంతే కాకుండా.. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌, ఇతర వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. ఈసారి 16వేల 321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6లక్షల 61వేల 196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసిన హాల్ టికెట్స్ పై ఫొటో తప్పనిసరిగా గమ్ తో అతికించాలి. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులతో కూడుకొని ఉంటుంది. తప్పుడు సమాధానానికి 0.20 నెగెటివ్‌ మార్కు ఉంటుందని అధికారులు తెలిపారు.


TSPSC Group 3-Group 4: గుడ్ న్యూస్.. గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..


నిబంధనలు ఇవే..


-కోవిడ్ 19 నేపథ్యంలో మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.


-హాల్ టికెట్స్ ను ఏ4 సైజ్ పేపర్ లోనే డౌన్ లోడ్ చేసుకుకోవాలి.


-అనంతరం అందులో నిర్ధేషించిన స్థలంలో అభ్యర్థి ఫొటోను గమ్ తో అంతికించుకోవాలి.


-దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఫొటోలపై పిన్ కొట్టొద్దు. ఇలా చేస్తే పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదు.


-చేతులకు మెహందీ, టాటూలు ఉంచకోకూడదు.


-హాల్లోకి హాల్ టికెట్స్ తో పాటు.. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ ను మాత్రమే తీసుకెళ్లాలి.


-మహిళా అభ్యర్థులు నగదు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లొక్ రూం సదుపాయం ఉండదు.


-ఓఎమ్ ఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారని హాల్ టికెట్స్ లో పేర్కొన్న నిబంధనలు చెబుతున్నాయి.


Constable Last Minute Tips: అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. వీటిని తప్పక పాటించండి..


పరీక్ష హాల్లో ఇలా..


1. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నా పత్రం తీసుకొని.. ఎలాంటి టెన్షన్ కు గురికావద్దు. ఒక్క 5 నిమిషాల వరకు ప్రశ్నలను మొదటి నుంచి చివరి వరకు చూసుకుంటూ వెళ్లండి.


2. తర్వాత ఏ ప్రశ్నకు మీకు జవాబు వస్తుందో వాటిని.. బబుల్ చేసుకుంటూ వెళ్లండి.


3. తర్వాత మ్యాథ్స్, రీజనింగ్ ప్రశ్నలు చేసుకుంటూ వెళ్లాలి. ఇలా పక్కా కరెక్ట్ అనిపించిన ప్రశ్నలను మీరు బబుల్ చేసిన తర్వాత ఎన్ని వచ్చాయో లెక్కేసుకోండి.


4.60కి పైగా ప్రశ్నలకు మీరు సమాధానాలు గర్తిస్తే.. జాగ్రత్తగా మిగతా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.


5. బబుల్ చేసే క్రమంలో ప్రశ్న సంఖ్యను జాగ్రత్తగా తనిఖీ చేసి మరీ బబుల్ చేయండి.


6. సర్కిల్ ను పూర్తిగా పెన్నుతో పూరించండి. అడ్డగీతలు, నిలువు గీతలు లాంటివి ఓఎమ్ ఆర్ పై గీయరాదు. వాటిని వ్యాలిడ్ చేసే అవకాశం ఉండదు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Ts constable, Tslprb

ఉత్తమ కథలు