హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Competition: TSPSC నుంచి విడుదలైన ఆరు నోటిఫికేషన్లు.. ఒక్క పోస్టుకు ఎంత మంది పోటీ..? తెలుసుకోండి..

TSPSC Competition: TSPSC నుంచి విడుదలైన ఆరు నోటిఫికేషన్లు.. ఒక్క పోస్టుకు ఎంత మంది పోటీ..? తెలుసుకోండి..

TSPSC Competition: TSPSC నుంచి విడుదలైన ఆరు నోటిఫికేషన్లు.. ఒక్క పోస్టుకు ఎంత మంది పోటీ..? తెలుసుకోండి..

TSPSC Competition: TSPSC నుంచి విడుదలైన ఆరు నోటిఫికేషన్లు.. ఒక్క పోస్టుకు ఎంత మంది పోటీ..? తెలుసుకోండి..

ఇటీవల తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష్ తేదీలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటికి ఎంత మంది పోటీ పడుతున్నారు. పూర్తి వివరాలను తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 175 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 13ని ఆఖరి తేదీగా నిర్ణయించింది టీఎస్పీఎస్సీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పోస్టులకు మొత్తం 33,342మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 190 మంది పోటీ పడుతున్నారు.

SI And PC PET Admit Cards Released: తెలంగాణ పోలీస్ ఈవెంట్స్ అడ్మిట్ కార్డ్స్ విడుదల.. వివరాలిలా..

ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మార్చి 12, 2023గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా వెల్లడి కాలేదు. త్వరలో ఈ తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అప్లికేషన్స్ కు సంబంధించి ఎటిడ్ ఆప్షన్ ను కల్పించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. రేపటి నుంచి (నవంబర్ 28) దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే.. వాటిని సరి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఈ విండో ఓపెన్ కానుంది. ఈ అవకాశాన్ని నవంబర్ 30, 2022 సాయంత్రం 5 గంటల వరకు కల్పించారు అధికారులు. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్లో వివరాలను పొందుపరిచారు.

Telangana Gurukul Notification: భారీగా పెరిగిన గురుకుల పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

దీంతో పాటు.. ఇటీవల టీఎస్పీఎస్సీ వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను ఖరారు చేశారు. ఇందులో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు , అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ఉద్యోగాలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు, ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు.. ఉన్నాయి.

పరీక్ష తేదీ, దరఖాస్తుల సంఖ్య వివరాలిలా..

పోస్టు పేరుపరీక్ష తేదీదరఖాస్తుల సంఖ్యపోటీ ఒక్క పోస్టుకు..
ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్జనవరి 03, 202319,814861
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1జనవరి 08, 202326,752147
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్జనవరి 22, 202381,87152
అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)ఫిబ్రవరి 12, 202374,48889
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ఫిబ్రవరి 26 , 20231,06,2632004

పైన పేర్కొన్న పోస్టుల్లో డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు 53 ఉండగా.. అత్యధికంగా ఒక్క పోస్టుకు 2004 మంది పోటీ పడుతున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అతి తక్కువగా ఒక్క పోస్టుకు 52 మంది పోటీ పడుతున్నారు.

First published:

Tags: JOBS, TSPSC

ఉత్తమ కథలు