Internship Alert : ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు మంచి ఉద్యోగం సంపాదించడం సులువేమీ కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటు అదనపు అర్హతలు ఉన్నవారికే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అందుకే విద్యార్థులు చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్‌లు(Internships) చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కళాశాలలో ఉన్నప్పుడే టెక్నికల్ నాలెడ్జ్, ఆఫీస్ పనితీరుపై అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ వివరాలు రెజ్యుమ్‌లో పేర్కొంటే.. రిక్రూటర్లు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్‌లో పలు కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
IICSR
ఇది రెండు నెలల వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు రూ.5000 స్టైఫండ్ అందుతుంది. ఇంటర్న్‌షిప్‌లో కంపెనీకి సంబంధించిన వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్, లాండింగ్ పేజీల మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌శాలలో అప్లై చేయవచ్చు.. డిసెంబర్ 24వ తేదీ గడువు.
Artyvis Technologies Pvt.Ltd
ఇది రెండు నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 స్టైఫండ్ అందజేస్తారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో అభ్యర్థుల పనితీరు బాగుంటే.. ఫుల్‌టైం జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. ఇంటర్న్‌శాల వెబ్‌సైట్‌లో డిసెంబర్ 23లోగా అప్లై చేసుకోవాలి.
Hunt Digital Media
హంట్ డిజిటల్ మీడియా ఇంటర్న్‌షిప్‌కు ఇంటర్న్‌శాల ద్వారా డిసెంబర్ 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ 5 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ఆఫర్ చేస్తోంది. ఇది వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశం. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.5000 స్టైఫండ్ అందుకుంటారు. కంపెనీ బిజినెస్ మోడల్స్‌కి అనుగుణంగా రిపోర్ట్స్ క్రియేట్ చేయడంపై పని చేయాల్సి ఉంటుంది.
Wonder News : తలపై ఫుట్‌బాల్‌తో రోజూ 20కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్న రిటైర్డ్ సోల్జర్ .. ఎందుకంటే
OVS BUSINESS SUPPORT INDIA (OPC) PVT LTD
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ ఒక నెలపాటు ఉంటుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000 స్టైఫండ్ అందుతుంది. ఈ వెబ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, డిజైనింగ్, మెయింటెనెన్స్, బిల్డింగ్‌పై పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌శాల ద్వారా డిసెంబర్ 24లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Eduminatti
Eduminatti కంపెనీ వెబ్ డెవలప్‌మెంట్‌పై రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఇది వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.12000 స్టైఫండ్ లభిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో ప్రస్తుతం ఉన్న ఫీచర్స్‌తో పాటు ఇతర విభాగాలకు డిజైనింగ్, రికమెండింగ్, ఇంప్రూవ్‌మెంట్స్ అందించడంపై పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌శాల పోర్టల్ ద్వారా డిసెంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Internship