Home /News /jobs /

HOPE BUSES BRING SCHOOL TO NEW DELHI STUDENTS AMID PANDEMIC PRV

Teaching: ఢిల్లీలో రోడ్డుపై పరుగెత్తుతున్న పాఠశాల.. పాఠాలూ చెబుతున్న వైనం

బస్సులో పాఠశాల

బస్సులో పాఠశాల

తేజస్ ఆసియా' అనే ఎన్‌జీవో ఏడేళ్ల కిందట కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించింది. ఈ మేరకు బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు 'హోప్ బస్సు'లను తయారుచేయగా.. ప్రస్తుతం నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలకు వెళుతున్నాయి. అక్కడ పిల్లలకు రెండు గంటలపాటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు మరో చోటికి వెళుతారు.

ఇంకా చదవండి ...
    ప్రపంచాన్ని కరోనా (corona) గడగడలాడిస్తోంది. పెద్దలు, యుక్త వయస్సు వారు.. చిన్నపిల్లలు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. దీంతో రెండేళ్లుగా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల(student) చదువులు(Education) అటకెక్కాయి. విద్యా సంవత్సరం నష్ట పోకూడదని ప్రభుత్వం ఏదో పాస్​(pass) చేస్తుందే కానీ, నిజంగా విద్యార్థులు పై తరగతులకు వెళ్లేందుకు అంతటి నైపుణ్యం ఉందా? విజ్ఞానం సంపాదించారా? అంటే ప్రశ్నార్థకమే. అయితే గుడ్డిలో మెల్ల అన్న చందంగా విద్యార్థులకు ఆన్​లైన్​లో క్లాసులు చెప్పిస్తోంది ప్రభుత్వం. అయితే ఆన్​లైన్​ చదువులంటే మాటలా? పిల్లలకు ఖరీదైన ఫోన్లు(phones) అవసరం, ట్యాబ్​లు(Tabs), ల్యాప్​టాప్(laptop)​లు ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. పేద మధ్య తరగతి జీవుడు ఇవేవీ కొనలేడాయే. మరి వారి పిల్లలు(children) ఎలా చదువుకోవాలి? అందుకే ఓ స్వచ్ఛంద సంస్థ అలాంటి పిల్లల కోసం రంగంలోకి దిగింది. టీచర్​(teacher) పాఠాలు(Teaching) చెప్పేది ఏదో స్కూల్​లోనూ, ఏదో గదిలోనో అనుకుంటే పొరబాటే. బస్సు(bus)లో.. ఓ బస్సునే స్కూల్​(school)గా మార్చేసింది ఆ సంస్థ. ఆ పాఠశాల (బస్సు) ఇప్పడు రోడ్డుపై పరుగెత్తుతోంది. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పిస్తోంది. అంతేనా చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు మధ్యాహ్న భోజనం(food) సైతం పెడుతోంది. ఇంతకీ బస్సులో పాఠాలెలా? ఎవరు చెబుతున్నారో తెలుసుకుందాం..

    చదువుకు దూరం అవకూడదని..

    కోవిడ్​ కారణంగా ఆన్​లైన్​ విద్యకు దూరం అయిన పిల్లలకు ఢిల్లీలోని 'హోప్' అనే కమ్యూనిటీ స్కూల్ సహాయపడుతుంది.  మొబైల్ తరగతి గదుల ద్వారా వెనుకబడిన పిల్లలు చదువు నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తోంది. తేజస్ ఆసియా' అనే ఎన్‌జీవో ఏడేళ్ల కిందట కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించింది. ఈ మేరకు బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు 'హోప్ బస్సు'లను తయారుచేయగా.. ప్రస్తుతం నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలకు వెళుతున్నాయి. అక్కడ పిల్లలకు రెండు గంటలపాటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు మరో చోటికి వెళుతారు.

    విద్యార్థులకు పుస్తకాలు ,ఆహారం, స్లేట్‌లు, కలరింగ్ పెన్నులు కూడా అందిస్తున్నారు. తర్వాత ప్రాథమిక విద్యా నైపుణ్యాలను నేర్పిస్తూ పిల్లల సామర్థ్యాన్నిబట్టి సదరు విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. ఇక లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయడంతో చాలామంది హోప్ బస్సుల్లో చదువుకోవడానికి వచ్చారని, దీంతో విద్యార్థులు, బస్సుల సంఖ్య పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.  హోప్ వ్యవస్థాపకుడు మార్లో ఫిలిప్  మాట్లాడుతూ.. హోప్ బస్సుల ద్వారా ప్రత్యేకంగా ఒక అండర్‌ సర్వడ్ కమ్యూనిటీలోని ప్రదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వారు బడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో పాఠశాలనే విద్యార్థుల వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాం.  హోప్ బస్సులు వారి జీవితాల్లో నిజమైన హోప్‌ను కలిగిస్తున్నాయని నమ్ముతున్నాను అని తెలిపాడు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Buses, Schools reopening

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు