హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Education Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Education Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య వైపు మళ్లడం లేదు. ఇటువంటి వారికి ఆర్థికపరంగా అండగా నిలుస్తూ అనేక బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను మంజూరు చేస్తున్నాయి.

కోవిడ్–19 ప్రభావం అన్ని రంగాలతో పోలిస్తే విద్యా రంగంపైనే ఎక్కువగా పడిందని చెప్పవచ్చు. దేశంలో మార్చి నెలలో లాక్డౌన్ ప్రారంభమవడంతో పై చదువులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. దీంతో విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య వైపు మళ్లడం లేదు. ఇటువంటి వారికి ఆర్థికపరంగా అండగా నిలుస్తూ అనేక బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుంది. ఈ బ్యాంకు భారతదేశంలో లేదా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించబోయే పౌరులకు టర్మ్ లోన్లను అందిస్తోంది. ఈ విద్యార్థి రుణంతో, కోర్సు వ్యవధి పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల వరకు లోన్ రీపేమెంట్ పీరియడ్ తో పాటు 12 నెలల రీమెంట్ పీరియడ్ హాలిడేను కూడా అందిస్తోంది. మీరు ఎస్బీఐ స్టూటెండ్ లోన్ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ విషయాలపై అవగాహన పెంచుకోండి.

కోర్సులు

భారతదేశంలో..


 1. యూజిసి / ఏఐసిటిఈ / ఐఎంసి / ప్రభుత్వం ఆమోదించిన కళాశాలలు / విశ్వవిద్యాలయాలు నిర్వహించే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు. రెగ్యులర్ టెక్నికల్, ప్రొఫెషనల్ డిగ్రీ / డిప్లొమా కోర్సులు. ఐఐటి, ఐఐఎం వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు నిర్వహించే రెగ్యులర్ డిగ్రీ /డిప్లొమా కోర్సులు.

 2. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఉపాధ్యాయ శిక్షణ / నర్సింగ్ కోర్సులు.

 3. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్/ షిప్పింగ్ / సంబంధిత రెగ్యులేటరీ అథారిటీలు అందజేసే ఏరోనాటికల్, పైలట్ ట్రైనింగ్, షిప్పింగ్ వంటి రెగ్యులర్ డిగ్రీ /డిప్లొమా కోర్సులు.


విదేశాల్లో..


 1. ఉద్యోగ ఆధారిత ప్రొఫెషనల్/ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు లేదా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అందజేసే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు.

 2. CIMA (చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్) - లండన్, CPA (సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్), అమెరికా నిర్వహించే కోర్సులు.


వీటి కింద రుణం మంజూరు చేస్తారు..


 1. కళాశాల/ పాఠశాల/ హాస్టల్‌కు చెల్లించాల్సిన ఫీజు.

 2. పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు.

 3. పుస్తకాలు / సామగ్రి / ఇన్స్ట్రుమెంట్స్ / యూనిఫాంల కొనుగోలు, కంప్యూటర్ల కొనుగోలు- చేయడానికి అయ్యే ఖర్చు.

 4. కాషన్ డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రీఫండెబుల్ డిపాజిట్. (కోర్సుకు ఖర్చయ్యే మొత్తం ట్యూషన్ ఫీజులో గరిష్టంగా 10 శాతం)

 5. ప్రయాణ ఖర్చులు /విదేశాలలో చదువుకోవడానికి అయ్యే పాసేజ్ ఖర్చు.

 6. రూ .50 వేల వరకు ద్విచక్ర వాహన ధర.

 7. స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్ మొదలైన కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన ఇతర ఖర్చులు.


ఎంత మొత్తం లోన్ మంజూరు చేస్తారంటే?

భారతదేశంలో..

వైద్య కోర్సులకు రూ .30 లక్షల వరకు మంజూరు చేస్తారు. ఇతర కోర్సులకు రూ .10 లక్షలు( కోర్సును బట్టి రూ.50 లక్షలు) వరకు రుణం మంజూరు చేస్తారు.

విదేశాలలో..

రూ .7.50 లక్షల వరకు (గ్లోబల్ ఎడ్-వాన్టేజ్ పథకం కింద విదేశాలలో చదువుకోవడానికి అధిక రుణ పరిమితి గరిష్టంగా రూ .1.50 కోట్ల వరకు) ఉంటుంది.

ప్రాసెసింగ్ ఛార్జీలు

రూ .20 లక్షల వరకు తీసుకునే విద్యా రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేయబడదు. కాగా, రూ .20 లక్షలకు పైబడిన రుణాలకు రూ .10,000 (అదనంగా పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడుతుంది.

సెక్యూరిటీ

రూ .7.5 లక్షల వరకు తీసుకునే రుణాలపై సహ- రుణగ్రహీతగా తల్లిదండ్రులు/ సంరక్షకులు ఉంటారు. దీనికి కొలాటిరల్ సెక్యూరిటి లేదా థర్డ్ పార్టీ హామీ అవసరం లేదు. అదే విధంగా, రూ .7.5 లక్షలకు మించి తీసుకునే రుణంపై సహ -రుణగ్రహీతగా తల్లిదండ్రులు/ సంరక్షకులు కొలాటిరల్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

మార్జిన్

రూ .4 లక్షల వరకు ఎటువంటి మార్జిన్ అవసరం లేదు. భారతదేశంలో చదువుకు గాను తీసుకునే రూ .4 లక్షలకు పైగా రుణంపై 5 శాతం, విదేశాలలో చదువుకోవడానికి తీసుకునే రూ.4 లక్షల రుణంపై 15 శాతం మార్జిన్ వర్తిస్తుంది. కోర్సు పూర్తయిన సంవత్సరం తర్వాత ఈఎంఐ చెల్లించడం ప్రారంభమవుతుంది. 15 సంవత్సరాలలో మొత్తం రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

First published:

Tags: Bank loans, Personal Loan, Sbi

ఉత్తమ కథలు