• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • HIRING FOR FRESHERS IMPROVING LIKELY TO CONTINUE TILL END OF FY21 NS

Fresher Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సిద్ధంగా 3.5 లక్షల ఉద్యోగాలు

Fresher Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సిద్ధంగా 3.5 లక్షల ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ఆ సమయంలో ఆగిపోయిన నియామక ప్రక్రియలు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 3.5 లక్షల జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వివిధ జాబ్ పోర్టల్స్ లలో ఉన్న వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.

  • Share this:
    కరోనా దెబ్బకు అనేక మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది రోడ్డున పడ్డారు. చాలా కంపెనీలు వేతనాల్లో కోత విధించడంతో అనేక మంది ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అనేక కంపెనీలు నియామక ప్రక్రియలను ఆపేశాయి. దీంతో అనేక మంది నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఆగిపోయిన నియామక ప్రక్రియలు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 3.5 లక్షల జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వివిధ జాబ్ పోర్టల్స్ లలో ఉన్న వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.

    ఈ-లెర్నింగ్, హెల్త్‌కేర్, హెచ్‌ఆర్, ఫిన్‌టెక్‌ విభాగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఐటీఈఎస్, తయారీ రంగం, బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికం, సెమికండక్టర్ల పరిశ్రమల్లోనూ గ్రోత్ ఉంచొచ్చని అంచనా వేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో 14 శాతం, సాఫ్ట్‌వేర్‌ రంగంలో 10 శాతం, కస్టమర్‌ సర్వీసింగ్ విభాగంలో 8 శాతం, మార్కెటింగ్‌లో 5 శాతం, సేల్స్‌లో 4 శాతం ఫ్రెషర్స్‌ జాబ్స్‌ పెరిగాయని ఇన్‌డీడ్‌ ఇండియా ఎండీ శశి కుమార్‌ వివరించారు.

    లాక్ డౌన్ సమయంలో ఆగిపోయిన నియామకాలు.. అన్ లాక్ ప్రారంభమయిన సమయం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఆఫర్ లెటర్స్ హోల్డింగ్ లో ఉన్న వారి నియామక ప్రక్రియ దాదపు 65 శాతం మంది పూర్తయినట్లు సమాచారం. రానున్న కొత్త సంవత్సరం జనవరి-మార్చి సమయం వచ్చే నాటికి నియమకాలు యథా స్థితికి చేరుకుంటాయని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ ఆదిత్య మిశ్రా అంచనా వేశారు. ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలను పరిశీలిస్తే.. గత ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్ తో పోల్చితే ఈ ఏడాది 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అయితే ఈ సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో ఎంపికైన ఉద్యోగుల వేతనాలు దాదాపు 10 శాతం తక్కువగా ఉండొచ్చన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు