హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Alert: టీచర్ ఉద్యోగాల నుంచి పోలీస్ జాబ్స్ వరకు.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన రిక్రూట్‌మెంట్స్ ఇవే..

Job Alert: టీచర్ ఉద్యోగాల నుంచి పోలీస్ జాబ్స్ వరకు.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన రిక్రూట్‌మెంట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర, రాష్ట్ర రిక్రూట్‌మెంట్ బోర్డులు వివిధ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. వీటి ద్వారా వేర్వేరు హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఏవో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Job Alert: ప్రభుత్వ ఉద్యోగాల(Govt Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్. ప్రస్తుతం ఉద్యోగాల సీజన్ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర రిక్రూట్‌మెంట్ బోర్డులు వివిధ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. వీటి ద్వారా వేర్వేరు హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఏవో చూద్దాం.

తెలంగాణ పోలీస్ జాబ్స్

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియలో ఫేజ్-2 కోసం దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి రౌండ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇప్పుడు ఫేజ్-2కు అప్లై చేసుకోవాలి. ఈ దశలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(PMT) లేదా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10 రాత్రి 10:00 గంటలలోపు అప్లై చేసుకోవాలి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్

సాయుధ దళాల్లో పోలీస్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) వివిధ దళాల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్‌ఎస్‌సీ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 24,369 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.69,100 వరకు జీతం లభించనుంది. ప్రధానంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సశస్త్ర సీమా బల్ (SSB), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), వంటి సాయుధ దళాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక అస్సాం రైఫిల్స్ (AR), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులను, NCBలో సిపాయి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్) పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్(ఐటీబీపీ) ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.92,300 వరకు జీతం లభిస్తుంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు నవంబర్ 23వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.

Numerology: ఈ వారం న్యూమరాలజీ..వారికి లవ్ మ్యారేజ్ యోగం,మిగతా వారికి అనుకూల సమయం

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్

జాతీయ స్థాయిలో టీచర్ అర్హత పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) చేపడుతుంది. సీ-టెట్ కోసం అర్హులైన అభ్యర్థులు నవంబర్ 24లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజును నవంబర్ 25 మధ్యాహ్నం 3:30 గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమరీ, ఎలిమెంటరీ లెవల్‌లో టీచింగ్ కోసం సీబీఎస్‌ఈ సీ-టెట్‌‌ను నిర్వహిస్తుంది.

కేరళ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(K-TET)

ఉపాధ్యాయ వ‌ృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్న వారికి కేరళ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేరళ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (KTET)-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 7లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కె-టెట్‌‌లో రెండు పరీక్షలు ఉంటాయి. ఒకటి లోయర్, అప్పర్ ప్రైమరీ తరగతులకు సంబంధించినది కాగా, మరోటి హైయర్ క్లాసుల కోసం నిర్వహించనున్నారు. కె-టెట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు నవంబర్ 21న రిలీజ్ కానున్నాయి.

First published:

Tags: Central Government Jobs, Govt Jobs 2022, JOBS

ఉత్తమ కథలు