హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Hiring Alert : ఎయిర్‌లైన్స్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు..క్యాబిన్ క్రూ,పైలట్,ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Hiring Alert : ఎయిర్‌లైన్స్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు..క్యాబిన్ క్రూ,పైలట్,ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో క్యాబిన్ క్రూ, పైలట్ల పోస్టుల భర్తీ కోసం ఖతార్ ఎయిర్‌వేస్, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Airlines Jobs : ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమ(Airline Industry) అభివృద్ధి చెందుతోంది. కరోనా తరువాత విమానయాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో చాలా ఎయిర్ లైన్స్ సంస్థలు(Airlines Companies) ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాయి. ఈ జాబితాలో కొన్ని డొమెస్టిక్ ఎయిర్ లైన్స్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ లెన్ సంస్థ ఉన్నాయి. తాజాగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో క్యాబిన్ క్రూ, పైలట్ల పోస్టుల భర్తీ కోసం ఖతార్ ఎయిర్‌వేస్, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు రిక్రూట్‌మెంట్(Recruitment) ప్రక్రియ చేపట్టాయి. కాగా, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ ఇప్పటికే రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించిన విషయాలు తెలిసిందే.

ఎయిర్ ఇండియా

భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా , దేశంలోని అహ్మదాబాద్, ముంబై, గౌహతి, గోవాల్లో క్యాబిన్ క్రూ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అలాగే ఎయిర్‌బస్ A320 విమానాల కోసం సీనియర్ ట్రైనీ పైలట్స్, బోయింగ్ 777 విమానాల కోసం పైలట్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించింది.

ఖతార్ ఎయిర్‌వేస్

ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ తమ గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతుగా భారతీయ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే నెలల్లో వారి కస్టమర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి మరింత మంది ఉద్యోగుల నియామకమే లక్ష్యంగా పెట్టుకుంది.

Viral Video : అట్లుంది మరి..పని చేయట్లేదని పోలీసులనే లాకప్ లో పెట్టాడు

ఏయే పోస్టులు భర్తీ కానున్నాయంటే?

క్యూలైనరి(culinary), కార్పొరేట్ అండ్ కమర్షియల్, మేనేజ్‌మెంట్, కార్గో, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్, ఫ్లైట్ ఆపరేషన్స్, గ్రౌండ్ సర్వీసెస్ వంటి రోల్స్ కోసం గణనీయ సంఖ్యలో కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఈ విదేశీ ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఖాతర్ గ్రూప్‌లోని వివిధ సంస్థల్లో కూడా నియామక ప్రక్రియ జరగనుంది. ప్రధానంగా ఖతార్ ఎయిర్‌వేస్, ఖతార్ డ్యూటీ-ఫ్రీ, ఖతార్ ఏవియేషన్ సర్వీసెస్, ఖతార్ ఎయిర్‌వేస్ క్యాటరింగ్ కంపెనీ, ధియాఫటినా హోటల్స్‌ కోసం ఖతార్ డిస్ట్రిబ్యూషన్‌లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ చేపట్టనున్నారు.

 ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా ఇండియా, గతవారం ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం కోసం గురుగ్రామ్‌లో క్యాబిన్ క్రూ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించింది. అలాగే ఢిల్లీ , బెంగళూరు, పూణె, డెహ్రాడూన్, లక్నోలలో కూడా క్యాబిన్ క్రూ కోసం హైరింగ్ డ్రైవ్‌లను నిర్వహించిన సంగతి తెలిసిందే.

 ప్రయాణికుల రద్దీ 57.7% వృద్ధి

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA ఇటీవల ఓ రిపోర్ట్ విడుదల చేసింది. 2021-22(ఏప్రిల్-మార్చి) మధ్యకాలంలో విమానయాన ప్రయాణీకుల రద్దీలో డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ సంస్థలు 57.7% వృద్ధిని సాధించాయని, ప్రయాణికుల సంఖ్య 84.2 మిలియన్లకు చేరిందని సదరు రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్‌లో హైలైట్ చేసింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Air India, Airlines, JOBS, Vistara Airlines

ఉత్తమ కథలు