హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs: హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో ఉద్యోగ అవకాశాలు..! డిగ్రీ అర్హతతో రూ.2 లక్షల వేతనం..!

Jobs: హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో ఉద్యోగ అవకాశాలు..! డిగ్రీ అర్హతతో రూ.2 లక్షల వేతనం..!

వైజాగ్ హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

వైజాగ్ హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హిందుస్థాన్ షిప్ యార్డ్ (Hindustan Shipyard) లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం. భారీగా ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే లక్షల్లో జీతం.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  హిందుస్థాన్ షిప్ యార్డ్ (Hindustan Shipyard) లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం. భారీగా ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే లక్షల్లో జీతం. సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణ సాధిస్తే చాలు చేతిలో ఉద్యోగం ఉన్నట్లే.. అంటూ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. విశాఖపట్నం (Visakhaptnam) లోని డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Hindustan Shipyard Limited) లో 55 సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, చీఫ్‌ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, కన్సల్టెంట్‌ తదితర పోస్టులకు ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.

  ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధులకు దరఖాస్తు ఆహ్వానాలు కోరుతూ భారీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పైన తెలిపిన పోస్టును బట్టి అభ్యర్దులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కోర్సులు , ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌, ఎల్‌ఎల్‌బీ, ఇంజినీరింగ్‌, డిగ్రీ, బీఈ, ఎంబీబీఎస్‌ , డిప్లొమా, ఎంసీఏ కోర్సులో యువకులు ఉత్తీర్ణులై ఉండాలి.

  ఇది చదవండి: మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌..! వెయ్యి నుంచి రూ.25 వేలు పొందే అవకాశం..! త్వరపడండి..!

  ఇందులో లీగల్‌, టెక్నికల్‌, సివిల్‌, సేఫ్టీ, హెచ్‌ఆర్‌, కమర్షియల్‌, డిజైన్‌, ప్లాంట్‌ మెయింటెనెన్స్‌, ఐటీ అండ్‌ ఈఆర్‌పీ, ఎలక్ట్రికల్‌, డైవింగ్‌ సిస్టమ్‌, కస్టమ్స్‌ అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను దీని ద్వారా నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు.

  ఇది చదవండి: ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.., ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి.. వివరాలివే..!

  అలాగే సంబంధిత యువత పైన తెలిపిన పోస్ట్‌లకు సంబంధించిన పనిలో కూడా అనుభవం ఉండాలని తెలిపారు. అభ్యర్ధుల వయసు 35 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

  ఇది చదవండి: ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్‌..! కారణం ఏంటంటే..?

  ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. దరఖాస్తులో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉండగా… ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ కేటగిరీ అభ్యర్ధులకు మాత్రం ధరఖాస్తు ఫీజులో మినహాయింపు వర్తించనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నాక షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌ ( Group Discussion), ఇంటర్వ్యూలో అర్హత సాధించిన యువకులను మెరిట్‌ ఆధారంగా ఫైనల్‌గా సెలక్ట్‌ చేస్తారు.

  ఈ కంపెనీలో జాబ్‌ సాధించిన వాళ్లకు నెలకు రూ.39,750ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు అధికారిక హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ వెబ్‌సైట్‌లో https://www.hslvizag.in/ చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వాళ్లు https://www.hslvizag.in/currentopenningrecruitment.aspx ఈ లింక్‌ను క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap jobs, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు