విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ రెండు కేటగిరీ ఉద్యోగాలను పర్మినెంట్ ఉద్యోగాలు కాగా.. తాత్కాళిక ప్రాతిపదికన ప్రాజెక్టు ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్(Medical Officer), సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మార్చి 08 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 06 వరకు ఉండనుంది. మరి కొన్ని పోస్టులకు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల యొక్క ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విశాఖపట్నం, హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఇంటర్వ్యూలు ఉంటాయి. మార్చి 23న ఈ ప్రక్రియ ఉండనుంది.
మేనేజర్ ఉద్యోగాల్లో.. లీగల్, కమర్షియల్, టెక్నికల్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 10 మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్లో.. ఫైనాన్స్ విభాగంలో 02 పోస్టులను భర్తీ చేస్తారు. ఇక డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం 24 ఉన్నాయి. ఈ 24 పోస్టులను ప్లాంట్ మెయింటెనెన్స్, ఐటీ అండ్ ఈఆర్‌పీ, సివిల్, టెక్నికల్, హెచ్‌ఆర్/ట్రెయినింగ్/అడ్మిన్, సెక్యూరిటీ & ఫైర్ సర్వీస్, సేఫ్టీ, డిజైన్, లీగల్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల్లో 04 ఖాళీ పోస్టులు ఉండగా.. సీనియర్ సీనియర్ అడ్వైజర్ పోస్టులు ఉన్నాయి. వీటిని కార్పొరేట్ & బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగంలో నియమించనున్నారు. ఐటీ అండ్ ఈఆర్పీ, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
అర్హతలు..
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 30-62 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.54880-రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.