Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 290 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Hindustan Copper Limited Recruitment 2020 | హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్-HCL మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 16, 2020, 1:16 PM IST
Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 290 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 290 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్-HCL భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 290 పోస్టుల్ని ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో భర్తీ చేస్తున్న అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 10న ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూలై 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustancopper.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు భారత ప్రభుత్వానికి చెందిన అప్రెంటీస్‌షిప్ పోర్టల్ http://www.apprenticeship.gov.in/ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

Top 10 Jobs: ఈ టాప్ 10 జాబ్స్‌కి ఫుల్ డిమాండ్... నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవే

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

HCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మేట్ (మైన్స్)- 60
బ్లాస్టర్ (మైన్స్)- 100
ఫిట్టర్- 30టర్నర్- 5
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 25
ఎలక్ట్రీషియన్- 40
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 6
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 6
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2
సర్వేయర్- 5

Railway Course: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ కోర్సులు చేయండి

Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

HCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 25
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2020 ఆగస్ట్ 10
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, బీఈ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు.
Published by: Santhosh Kumar S
First published: July 16, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading