హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Highest Paying Jobs: టెక్నాలజీ సెక్టార్‌లో ఈ జాబ్స్ కు అత్యధిక జీతం.. ఓ లుక్కేయండి

Highest Paying Jobs: టెక్నాలజీ సెక్టార్‌లో ఈ జాబ్స్ కు అత్యధిక జీతం.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని టెక్నాలజీ సెక్టార్‌లోని ఉద్యోగాలు, జీతాలు, నైపుణ్యాలపై ఇన్‌స్టా‌హైర్ (Instahyre) అనే సంస్థ ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఏ విభాగంలోని జాబ్ రోల్‌కు ఎక్కువ జీతం లభిస్తోంది, ఏయే నగరాల్లో ఉద్యోగాలకు సంబంధించిన గణాంకాలు ఎలా ఉన్నాయో పేర్కొంది. ఆ వివరాలు చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కారణంగా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో (Technology Sector) అనేక ఉపాధి (Employment) మార్గాలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. టెక్నాలజీ ట్యాలెంట్‌కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతుండడంతో జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టెక్నాలజీ సెక్టార్‌లోని ఉద్యోగాలు (Jobs), జీతాలు, నైపుణ్యాలపై ఇన్‌స్టా‌హైర్ (Instahyre) అనే సంస్థ ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఏ విభాగంలోని జాబ్ రోల్‌కు ఎక్కువ జీతం లభిస్తోంది, ఏయే నగరాల్లో ఉద్యోగాలకు సంబంధించిన గణాంకాలు ఎలా ఉన్నాయో పేర్కొంది. ఆ వివరాలు చూద్దాం.

ఇన్‌స్టా‌హైర్ రిపోర్ట్ ప్రకారం స్ట్రీమింగ్ అండ్ OTT ప్లాట్‌ఫామ్స్.. 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్రంట్ ఎండ్ జాబ్ రోల్‌కు అత్యధిక జీతాలు చెల్లిస్తున్నాయి. తరువాతి స్థానంలో ఇంటర్నెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి 6-10 సంవత్సరాల అనుభవం ఉన్న మిడ్- లెవల్స్ ట్యాలెంట్‌కు అధిక జీతాలు ఇస్తున్నాయి. ఇక రెండు నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్న జూనియర్ లెవల్స్‌కు ఫుడ్ టెక్నాలజీ కంపెనీలు భారీగా జీతాలను అందిస్తున్నాయి. ఈ-కామర్స్ సంస్థలు బ్యాకెండ్ టెక్‌లో సీనియర్ లెవల్స్‌కు అత్యధిక జీతాలను చెల్లిస్తున్నాయి. ఫిన్‌టెక్‌లో డేటా సైన్‌టిస్ట్‌లకు అత్యధికంగా జీతాలు అందుతున్నాయి.

IIT Roorkee: ఐఐటీ రూర్కీ నుంచి ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్.. కోర్సు ప్రత్యేకతలివే..

టెక్ ఉద్యోగుల్లో బెంగళూరు ఫస్ట్

టెక్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నగరాల్లో బెంగళూర్ టాప్ ప్లేస్‌లో ఉంది. మరోపక్క టైర్ II & III నగరాల్లో ట్యాలెంట్‌ను పెంచడానికి రిమోట్ అండ్ హైబ్రిడ్ వర్క్ బాగా దోహదపడిందని రిపోర్ట్ వెల్లడించింది. పూణే, ఇండోర్, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్ వంటి టైర్ II & III నగరాల్లో టెక్ టాలెంట్‌కు అద్భుతమైన రిసోర్స్‌గా మారాయని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్‌మెంట్‌లో న్యూ టెక్ రోల్స్ కోసం టెక్ రిక్రూటర్స్, టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్‌లు ఈ రిసోర్స్‌ను బాగా వినియోగించుకోవచ్చని రిపోర్ట్ సూచించింది.

ప్రస్తుత టెక్ టాలెంట్‌లలో నైపుణ్యం, రీస్కిల్లింగ్‌ను షార్ట్‌టర్మ్‌లో పెంపొందించేలా టెక్ కంపెనీలు సహకరించాలని రిపోర్ట్ సూచించింది. దీర్ఘకాలంలో జాబ్ రెడీ ఇండియన్ టెక్ ట్యాలెంట్‌ను క్రియేట్ చేయడానికి, టెక్ సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి విద్యా సంస్థలతో టెక్ ఇండస్ట్రీ టైఅప్ కావాలని కూడా ఇన్‌స్టా‌హేర్ రిపోర్ట్ సూచించింది.

యాప్ డెవలపర్స్‌లో ఆండ్రాయిడ్ టాప్

టెక్ స్కిల్స్ గణాంకాలను కూడా ఇన్‌స్టా‌హైర్ రిపోర్ట్ వెల్లడించింది. పైథాన్ డేటా సైన్స్‌‌ను డామినేట్ చేసిందని రిపోర్ట్ పేర్కొంది. దేశంలో 75% డేటా సైంటిస్టులు పైథాన్‌లో స్పెషలైజేషన్ చేయడంతో ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. యాప్ డెవలపర్స్‌లో ఆండ్రాయిడ్ 48%తో ముందుంది, ఇది iOS (24%) కంటే 2 రెట్లు ఎక్కువ జనాదరణ పొందింది. ఇక, ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్‌ల విషయానికి వస్తే.. HTML, CSS 31 శాతంతో దేశంలోని యంగ్ టెక్ టాలెంట్‌లలో అత్యంత ప్రజాదరణ పొందాయి.

జెండర్ గ్యాప్ ఎక్కువే

టెక్ టాలెంట్‌లో మహిళా ప్రతిభ పెరిగినప్పటికీ, ఇప్పటికీ భారీగా జెండర్ డైవర్సిటీ గ్యాప్ ఉంది. మహిళలు- పురుషుల మధ్య ఓవరాల్ నిష్పత్తి సగటున 25:75గా ఉంది. ఇండియాలో బ్యాకెండ్ డెవలపర్స్‌లో 17:83 నిష్పత్తితో అత్యధిక జండర్ డైవర్సిటీ గ్యాప్ ఉంది. భారతదేశంలో టెక్ టాలెంట్‌లో డిమాండ్-సప్లైలో 20% గ్యాప్ ఎక్కువగా ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. ఇది 2026 నాటికి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది.

First published:

Tags: Career and Courses, IT jobs, JOBS

ఉత్తమ కథలు