Highest Paying Jobs : ఇండియాలో ఎక్కువ జీతం ఇచ్చే జాబ్స్ ఇవే..

ఆటోమేషన్, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల వారు.. తమ స్కిల్స్‌ని కాస్తా డెవలప్ చేసుకుంటే.. ఇంకో ఐదారేళ్ల వరకూ వీరికి ఏం ఢోకా లేదు.

Amala Ravula | news18-telugu
Updated: April 20, 2019, 4:11 PM IST
Highest Paying Jobs :  ఇండియాలో ఎక్కువ జీతం ఇచ్చే జాబ్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 20, 2019, 4:11 PM IST
టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి రోజులు వచ్చేసాయి. కొన్ని రోజుల వరకూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ రంగం ఇప్పుడు కోలుకోవడమే కాక.. పరుగులు పెడుతోంది.. తమ ఉద్యోగులకి జీతాల రూపంలో వరాలిచ్చేస్తోంది. ముఖ్యంగా ఆటోమేషన్, డేటా సైంటిస్టులు ఇప్పుడు పట్టిందల్లా బంగారమని చెప్పొచ్చు.
‘ది ఫ్యూచర్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఇన్ ఇండియా’ పేరిట జరిగిన సర్వే తెలిపిన వివరాల ప్రకారం... ఆటోమేషన్, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల వారు.. తమ స్కిల్స్‌ని కాస్తా డెవలప్ చేసుకుంటే.. ఇంకో ఐదారేళ్ల వరకూ వీరికి ఏం ఢోకా లేదు. వేతనాలు కూడా వారి ప్రతిభను బట్టి అధికంగానే ఇస్తున్నట్లు ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

డేటా సైంటిస్టులు.. ఏఐ ఇంజనీర్స్, క్లౌడ్ ఆర్కిటెక్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజర్స్, డిజిటల్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ ఇలా ప్రతి విభాగంలోనూ చాలా ఖాళీలున్నాయి. వీటి ఆధారంగా.. మీ నైపుణ్యతను పెంచుకుంటే చాలు.. ఐటీ రంగంలో మీ ప్రతిభను చూపొచ్చు.. అధిక జీతాలను పొందొచ్చంటూ నిపుణులు చెబుతున్నారు.

మరింకెందుకు ఆలస్యం.. మీరూ ఆ ఉద్యోగం చేసేందుకు అర్హులేనా.. అయితే.. మీ నైపుణ్యాలను పెంచుకోండి.. జీవితాన్ని బంగారుమయం చేసుకోండి..


 
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...