కరోనా కారణంగా గతేడాది నుంచి పాఠశాలలు ఆన్‌లైన్‌లోనే విద్యా బోధన కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు సైతం ఆన్‌లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. అయితే ఈ సంవత్సరం కూడా మహమ్మారి కారణంగా పరీక్షలు సాధ్యం కాలేదు. పరీక్షలతో పని లేకుండానే అందరినీ పైతరగతులకు పంపించారు. ప్రస్తుతం వేసవి సెలవుల్లో సైతం పిల్లలు బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ ఒకేషనల్ కోర్సుల్లో చేరేందుకు నమోదు చేసుకుంటున్నారు. కొత్తరకం వృత్తివిద్యా కోర్సుల్లో చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో వేదిక్ మ్యాథ్స్, డ్యాన్స్, క్రాఫ్ట్స్, సింగింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, మెడిటేషన్, యోగా వంటివి ఆన్‌లైన్ ద్వారా పిల్లలకు నేర్పించడం ఈ మధ్య మరింత పెరిగింది. ఇలాంటి ఆన్‌లైన్ తరగతులను అందించేందుకు ప్రత్యేకంగా కొన్ని సంస్థలు సైతం పుట్టుకొచ్చాయి.
పిల్లల అభిరుచులు, ఆసక్తులను బట్టి వారికి నచ్చిన కోర్సును ఎంచుకునే వీలుంటుంది. ఈ విధానంలో అనుభవం ఉన్న టీచర్లతోనే పాఠాలు చెప్పిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు వారి పాఠశాలలు మూసేసిన వెంటనే ఇందులో చేరారు. పిల్లల్ని ఆడుకోవడానికి బయటకి పంపించలేని పరిస్థితుల్లో.. వాళ్లను ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఒకేషనల్ కోర్సులకు ఆదరణ పెరిగింది. ఈ ఆన్‌లైన్ తరగతుల్లో రోజూ ఎదో ఒక కొత్త విషయంపై విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. అందువల్ల పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంది.
ఒత్తిడి దూరం
రెగ్యులర్ ఆన్‌లైన్ క్లాసుల మాదిరిగా విద్యార్థులపై ఒత్తిడి కూడా ఉండదు. దీంతో విద్యార్థులు కూడా సంతోషంగా కోర్సుల్లో భాగమవుతున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఫ్యామిలీ ట్రీ తయారీ, బర్డ్ హౌస్, కూరగాయలతో గణేషుడి విగ్రహం చేయడం.. లాంటి ఆసక్తి కలిగించే చాలా విషయాలు పిల్లల మెదడులకు చురుగ్గా ఉంచుతున్నాయి. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసులతోనూ కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ప్రాథమిక తరగతుల విద్యార్థులు కోర్సుల్లో బాగానే నిమగ్నమవుతున్నారు. కానీ టీనేజర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది నిర్వాహకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid-19, EDUCATION, Online classes, Online Education