TS EAMCET 2020: ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపేయండి.. జేఎన్టీయూకు హై కోర్టు కీలక ఆదేశాలు

TS EAMCET 2020: గురువారం నుంచి జరగాల్సిన ఎంసెట్‌ రెండో‌ విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని జేఎన్‌టీయూను హైకోర్టు ఆదేశించింది. 35 శాతం మార్కులు వచ్చిన వారిని సైతం రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతించాలని ఆదేశించింది.

news18-telugu
Updated: October 29, 2020, 11:25 AM IST
TS EAMCET 2020: ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపేయండి.. జేఎన్టీయూకు హై కోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జరగాల్సిన రెండో విడత‌ కౌన్సెలింగ్‌ను ఆపేయాలని జేఎన్‌టీయూకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా.. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించి పరీక్షలు‌ రాయలేకపోయిన, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. అలాంటి విద్యార్థులకు 35 శాతం మార్కులు వచ్చినట్లుగా పరిగణించి పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎంసెట్‌ నిబంధనలకు అనుగుణంగా వారికి 45 శాతం మార్కులు రాలేదు. దీంతో వారంతా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ పిటీషన్ ను విచారించారు.

అయితే విచారణ సందర్భంగా.. పిటీషన్ దాఖలు చేసిన విద్యార్థుల మాదిరిగా 35 శాతం మార్కులు వచ్చిన వారిని సైతం రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసే వరకు కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని జేఎన్టీయూకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంసెట్‌ పరీక్షను నిర్వహిస్తున్న జేఎన్‌టీయూకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 40/45 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్ కౌన్సెలింగ్ కు హాజరు కావాలన్న నిబంధనను సవరిస్తామని  ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్ కోర్టకు హామీ ఇచ్చారు.

దీంతో ఈ అంశాన్ని కోర్టు తన రికార్డుల్లో నమోదు చేసింది. గత నిబంధనను మార్చి 35 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులను సైతం కౌన్సెలింగ్ కు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంసెట్‌ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు రెండు రోజుల్లో జీవో జారీ చేయనున్నట్లు ఏజీ చెప్పారు. ఈ అంశంపై స్పందించిన న్యాయమూర్తి.. జీవో జారీ అయ్యే వరకు సెకండ్ ఫేజ్ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
Published by: Nikhil Kumar S
First published: October 29, 2020, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading