Home /News /jobs /

Hero Group: ఎడ్​టెక్​ రంగంలోకి వచ్చిన హీరో గ్రూప్... ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణే లక్ష్యం

Hero Group: ఎడ్​టెక్​ రంగంలోకి వచ్చిన హీరో గ్రూప్... ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణే లక్ష్యం

Hero Group: ఎడ్​టెక్​ రంగంలోకి వచ్చిన హీరో గ్రూప్... ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణే లక్ష్యం
(ప్రతీకాత్మక చిత్రం)

Hero Group: ఎడ్​టెక్​ రంగంలోకి వచ్చిన హీరో గ్రూప్... ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణే లక్ష్యం (ప్రతీకాత్మక చిత్రం)

Hero Vired | హీరో గ్రూప్ హీరో వైర్డ్ పేరుతో ఎడ్​ టెక్​ రంగంలో అడుగుపెట్టింది. ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామంటోంది.

కరోనా విజృంభనతో విద్యా బోధన అంతా ఆన్​లైన్​ విధానంలో సాగుతోంది. దీంతో ఎడ్​టెక్​ సంస్థలకు మంచి డిమాండ్​ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రంగాలకు చెందిన సంస్థలు సైతం ఎడ్​టెక్​ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా, హీరో గ్రూప్ ఎడ్​ టెక్​ రంగంలోకి ప్రవేశించింది. హీరో వైర్డ్ అనే ఎడ్​టెక్​ కంపెనీని ప్రారంభించింది. భారతదేశంలోని ప్రొఫెషనల్ కమ్యూనిటీని అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ప్లాట్​ఫామ్​ను ప్రారంభించింది. మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), సింగులారిటీ యూనివర్సిటీ, ఉచిత కోడింగ్ తరగతులను అందించే అమెరికన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం కోడెకాడమీ సహకారంతో ఆన్​లైన్​ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం ఈ వెంచర్‌లో మొత్తం 10 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. ఫైనాన్స్ టెక్నాలజీలలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను అందించడంతో తమ ఎడ్​టెక్​ ప్లాట్​ఫామ్​ను ప్రారంభిస్తున్నామని హీరో వైర్డ్ వ్యవస్థాపకుడు, సిఈఓ అక్షయ్ ముంజాల్ అన్నారు. దీనితో పాటు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఫుల్​-స్టాక్ డెవలప్​మెంట్​, గేమ్​ డిజైన్​, ఇన్నోవేషన్​ వంటి ప్రోగ్రామ్స్​ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజైన్, ఎలక్ట్రానిక్స్, లీటర్​షిప్​, హెల్త్​ మేనేజ్​మెంట్​ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో కోర్సులను అందిస్తామని హీరో గ్రూప్​ స్పష్టం చేసింది.

IIT Summer Internship: ఐఐటీలో ఇంటర్న్‌షిప్ చేయొచ్చు... 2 రోజుల్లో అప్లై చేయండి

Coal India Jobs 2021: కోల్ ఇండియాలో 361 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

డిజిటల్​ ఇండియా చొరవతో


భారతీయ ఎడ్​టెక్‌ పరిశ్రమపై ఇటీవలి ఒమిడ్యార్ నెట్‌వర్క్ ఇండియా- రెడ్‌సీర్ నివేదిక ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం, 2022 నాటికి ఎడ్​టెక్​ మార్కెట్ 1.8 బిలియన్ డాలర్ల మేర ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉన్నత విద్యా కోర్సులు, టెక్నికల్​ స్కిల్​ కోర్సులు, ప్రభుత్వ ఉద్యోగాలకు, ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్​పై కోర్సులను ఈ ఎడ్​టెక్​ సంస్థ అందించనుంది. ఈ సరికొత్త ఎడ్​టెక్​పై ముంజాల్ మాట్లాడుతూ “భారతదేశం ఒక ప్రత్యేకమైన ‘ఎంప్లాయబిలిటీ పారడాక్స్ ’ను ఎదుర్కొంటుంది. దేశంలో నైపుణ్యం గల నిపుణుల కొరత వేదిస్తోంది. ఏటా డిగ్రీలు పూర్తి చేసుకొని లక్షలాది మంది బయటకి వస్తున్నా.. వారిలో కొద్ది మందికి మాత్రమే నైపుణ్యాలు ఉంటున్నాయి. తద్వారా మిగతావారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందువల్ల, జాతీయ విద్యా విధానం క్రింద ఏర్పడిన డిజిటల్ ఇండియా చొరవతో ఆన్‌లైన్ విద్యావిధానాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాం. ఈ విధానం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు ఇండస్ట్రీలకు అవసరమైన నైపుణ్యాణలను నేర్పించి నిపుణులుగా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం.” అని అన్నారు. మా ప్రోగ్రామ్స్​ ద్వారా లైవ్​ ఆన్‌లైన్ క్లాసులు, మెంటర్​షిప్​ సెషన్లు నిర్వహించడం, వారి సందేశాలను నివృత్తి చేయడం, ఒకరితో ఒకరు ఇంటరాక్టివ్ అయ్యేలా సెషన్లను నిర్వహించడంపై దృష్టి పెట్టింది.’’ అని ఆయన చెప్పారు.

Bank Jobs 2021: బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఈ నోటిఫికేషన్ వచ్చేస్తోంది

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

తొలుత హీరో వైర్డ్ 1,500 మంది నిపుణులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెంచాలని యోచిస్తోంది. కాగా, 2014లో హీరో గ్రూప్ గుర్గావ్ శివార్లలోని BML ముంజల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. హీరో గ్రూప్ ట్రైనింగ్​, కన్సల్టింగ్ సర్వీసులను అందించేందుకు హీరో మైండ్‌మైన్ అనే సంస్థను కూడా నడుపుతుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, EDUCATION, Online classes, Online Education

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు