ఈ ఏడాది ఎగ్జామ్ సీజన్ (Exam Season) మొదలైంది. ఇంటర్ పరీక్షలు (Inter Exams) ఇప్పటికే ప్రారంభం కాగా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అయితే పరీక్షల కారణంగా చాలామంది విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఫలితంగా కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేయకుండా తల్లిదండ్రులు హై-ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా విద్యార్థుల్లో ఒత్తిడి పెరగటానికి ఒక కారణమని నిపుణులు అంటున్నారు. అలాగే వీటికి చెక్ పెట్టే టిప్స్ కొన్నింటిని సూచించారు. అవేంటో చూద్దాం.
* ఎగ్జామ్స్ స్ట్రెస్ దూరం చేసే మార్గాలు
- పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌ను అలా ఒంటరిగా వదిలేయకూడదు. వారికి పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. అలాగే వారికి ఇష్టమైన వారితో మాట్లాడించాలి.
- విద్యార్థులు తమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే విధంగా ప్రిపరేషన్ షెడ్యూల్ రూపొందించుకోవాలి. చివరి నిమిషంలో కొత్త టాపిక్స్ జోలికి పోయి అనవసర టెన్షన్ కొని తెచ్చుకోవద్దు.
- ప్రిపరేషన్ సమయంలో అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి. దీంతో ఈ మైండ్ రిలాక్స్ అవుతుంది.
- సరైన నిద్ర లేకపోతే మానసికంగా ఇబ్బంది పడతారు. అందుకే రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు ప్రిపరేషన్‌కు మైండ్ రీఫ్రెష్‌గా ఉంటుంది. స్టడీపై బాగా ఫోకస్ చేయవచ్చు.
- ప్రిపరేషన్‌పై విద్యార్థులకు వాస్తవ అంచనాలు ఉండాలి. ఇవి సామర్థ్యానికి తగ్గట్టు ఉండాలి. అంతేకానీ మార్కులు, గ్రేడ్స్ విషయంలో ఇతరులతో పోటీ పెట్టుకోవద్దు.
- రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో బ్యాలెన్స్‌డ్‌గా నిర్ణయాలు తీసుకొవడానికి మైండ్ సహకరిస్తుంది.
- ప్రిపరేషన్ సమయంలో హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ తీసుకోకుండా మంచి పోషక విలువలున్న ఫుడ్ తీసుకోవాలి.
* ఆందోళన ఎందుకు?
పరీక్షలకు ముందు, రిజల్ట్స్ సమయంలో చాలా మంది విద్యార్థులు ఆందోళన, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్, భవిష్యత్ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని, ఇలాంటి వారికి కౌన్సెలింగ్, మెడిసిన్ అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇక పోటీ పరీక్షల సమయంలో విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటోంది. పేపర్ టఫ్‌గా ఉండటంతో పాటు పోటీ తీవ్రంగా ఉండడం వల్ల సక్సెస్ అవుతామో లేదోనన్న భయం యువతను వేధిస్తోంది.
ఇది కూడా చదవండి : సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆరువేల ఫ్యాకల్టీ పోస్టులు.. ఐఐటీల్లో 4526 పోస్టులు!
* ప్రధాన కారణం ఇదేనా?
పరీక్షల సమయంలో ఆందోళన, ఒత్తిడి ఉండడం సహజం. అయితే అది శృతిమించకుండా చూసుకోవాలి. సాధారణంగా ఇలాంటి సమస్యలపై విద్యార్థులు తమ తోటివారితో లేదా తల్లిదండ్రులతో చర్చించరు. ప్రిపరేషన్‌లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు.
తల్లిదండ్రుల నుంచి ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం కూడా విద్యార్థులు ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశం ఉంది. చదువు కోసం ఇటీవల కాలంలో విద్యార్థులను హాస్టల్స్‌లో ఉంచుతున్నారు. దీంతో విద్యార్థులు బయటకు వెళ్లడానికి, ఆడుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి తల్లిదండ్రులు దగ్గరగా ఉండరు. దీంతో విద్యార్థులు మానసిక సమస్యల బారినపడే అవకాశం ఉంది.
* జీవితంపై అవగాహన ముఖ్యం
పరీక్షలో ఫెయిల్ అయితే చాలా మంది విద్యార్థులు జీవితం అంతా అయిపోయిందని భావించి తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అయితే ఈ సమయంలో వారికి జీవితం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకసారి పరీక్షలో ఫెయిలైతే, మరోసారి రాయవచ్చు లేదా వేరేది ఏదైనా ప్రయత్నించవచ్చు అని చెప్పేవారు ఉండాలి. ఈ బాధ్యతను ప్రధానంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Exam Tips, Exams, JOBS