చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన ఒక విద్యార్థి (Student).. తన కష్టానికి ప్రతిఫలంగా భారీ ప్యాకేజీతో ఉద్యోగం (Job) సాధించాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రేమే అయినా.. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. కష్టాలను పునాదిగా చేసుకున్న ఆ రైతుబిడ్డ.. చివరికి అనుకున్న లక్ష్యం సాధించాడు. ఏకంగా రూ.15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి తన కుటుంబానికి బాసటగా నిలిచాడు ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన శివమ్ సింగ్ (Shivam Singh) అనే విద్యార్థి. అతడి సక్సెస్ స్టోరీ (Success Story) తెలుసుకుందాం.
యూపీకి చెందిన శివమ్ సింగ్ ఈ ఏడాది లక్నో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా గురుగ్రామ్‌లోని నోరిష్ ఫ్రేమ్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్రోత్ హ్యాకర్‌గా ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీతో అతడు ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. శివమ్ తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ ఒక సాధారణ వ్యవసాయదారుడు, తల్లి మీనా సింగ్ గృహిణి.
శివమ్‌కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ESOP) పథకం కింద రూ.38 లక్షల నుంచి 6.5 కోట్ల స్టాక్ ఆప్షన్స్‌తో రూ.15 లక్షల ప్యాకేజీని కంపెనీ ఆఫర్ చేసింది. ESOP ద్వారా కంపెనీ ఉద్యోగులకు వారు పనిచేస్తున్న కంపెనీ షేర్లను పొందే హక్కు కూడా లభిస్తుంది.
శివమ్ మొదటి నుంచి గుడ్ స్టూడెంట్ అని చెబుతున్నారు లక్నో యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ హిమాన్షు పాండే. భారీ ప్యాకేజీతో అతడు ఉద్యోగం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీటెక్ మూడో సంవత్సరంలో శివమ్ తన స్టార్టప్ ‘Oregen’ కోసం 75000 డాలర్ల (టెక్ క్రెడిట్) స్పాన్సర్షిప్ కూడా పొందాడు.
మరోవైపు, లక్నో యూనివర్సిటీ గత నెలలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) నుంచి A++ గ్రేడ్ పొందింది. దీంతో దేశంలోని అనేక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో శివమ్ మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.
ఇది కూడా చదవండి : ‘మా జీవితాలతో ఆడుకోవద్దు.. త్వరగా ఆ పని చేయండి’.. డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు..!
* ఆ స్టూడెంట్ కూడా..
మరోవైపు, మరోవైపు మారుమూల గ్రామానికి చెందిన వారు కూడా చదువుల్లో రాణించగలరని నిరూపించింది అన్షికా పటేల్ అనే యువతి. యూపీలోని జౌన్పూర్ జిల్లా పక్రి గోడమ్కు చెందిన ఈ 18 ఏళ్ల అమ్మాయి 100 శాతం స్కాలర్‌షిప్‌తో యూఎస్‌లోని లీ యూనివర్సిటీలో సీటు సంపాదించింది.
గణితంలో మైనర్‌తో పాటు ఎకనామిక్స్ మేజర్స్ చదవాలనుకుంటుంది. ఖతార్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి కూడా ఎంపిక అయింది. అలాగే మరో ఐదు యూనివర్సిటీలు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నాయి. వాషింగ్టన్‌లోని లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నానని ఆమె తెలిపింది. ఈ అమ్మాయి తండ్రి ఒక చిన్న జనరల్ స్టోర్‌లో పనిచేస్తుండగా, తల్లి టైలర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Success story, Uttar pradesh