హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Employment Trends: మూన్‌లైటింగ్, క్వైట్ ఫైరింగ్, క్వైట్ క్విటింగ్ ట్రెండ్స్.. వీటి అర్థం ఏంటో తెలుసా..?

Employment Trends: మూన్‌లైటింగ్, క్వైట్ ఫైరింగ్, క్వైట్ క్విటింగ్ ట్రెండ్స్.. వీటి అర్థం ఏంటో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Employment Trends: కరోనా మహమ్మారి తరువాత వర్డల్ వైడ్‌గా ప్రొఫెషనల్ రంగాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వర్క్ కల్చర్‌లో కొత్త ట్రెండ్స్‌ ఇప్పుడు కామన్‌గా మారాయి. ఇటీవలి కాలంలో కొన్ని కొత్త పదాలు వర్క్ కల్చర్‌లో తరుచూ వినిపిస్తున్నాయి. క్వైట్ క్విటింగ్, మూన్ లైటింగ్, క్వైట్ ఫైరింగ్ అనే పదాల మీనింగ్ ఏంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా (Covid-19) మహమ్మారి తరువాత వర్డల్ వైడ్‌గా ప్రొఫెషనల్ రంగాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వర్క్ కల్చర్‌లో కొత్త ట్రెండ్స్‌ ఇప్పుడు కామన్‌గా మారాయి. ఇటీవలి కాలంలో కొన్ని కొత్త పదాలు వర్క్ కల్చర్‌లో తరుచూ వినిపిస్తున్నాయి. క్వైట్ క్విటింగ్ (Quite Quitting), మూన్ లైటింగ్ (Moonlighting), క్వైట్ ఫైరింగ్ (Quite Firing) అనే పదాలు ఉద్యోగుల నోటి నుంచి వస్తున్నాయి. దీంతో వీటి గురించి సాధారణ ప్రజలకు సైతం ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ట్రెండ్స్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం.

* మూన్‌లైటింగ్

ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా వేరే కంపెనీలో కూడా ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ (Moonlighting) అంటారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒకేసారి రెండు కంపెనీల్లో పనిచేయడం అని అర్థం. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడం సర్వసాధారణమైంది. దీంతో మూన్‌లైటింగ్ కల్చర్ పెరుగుదలకు ఇది కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ అంశం చర్చనీయాంశమైంది. చాలా ఐటీ కంపెనీలు మూన్‌లైటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉద్యోగులు మల్టిపుల్ ఉద్యోగాలు చేయడం అనేది ఉత్పాదకతపై తీవ్ర ప్రభావితం చూపుతుందని ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూన్ లైటింగ్‌పై తమ ఉద్యోగులను హెచ్చరించింది. మరో ఐటీ కంపెనీ విప్రో కూడా మూన్ లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి బయటకు పంపించేసింది.

* క్వైట్ ఫైరింగ్

క్వైట్ ఫైరింగ్‌ను (Quite Firing) పొమ్మనలేక పొగబెట్టడంగా భావిస్తారు. జాబ్ సమయంలో ఉద్యోగిని ప్రాపర్‌గా మేనేజ్‌ చేయకుండా.. యాజమాన్యం వారికి సరైన డ్యూటీస్ ఇవ్వకుండా నెగ్లెక్ట్‌ చేసి.. ఉద్యోగులు తమ ఉద్యోగాలను మానేసేలా చేయడాన్ని క్వైట్ ఫైరింగ్ అంటారు. ఈ పదం కొత్తగా ఉంటున్నా ఈ కాన్సెప్ట్ కుడా ఎప్పటి నుంచో ఉంది.

* క్వైట్ క్విటింగ్ (Quite Quitting)

ఇది ఉద్యోగుల డిమాండ్‌కు సంబంధించిన ట్రెండ్. ఈ కాన్సెప్ట్ జాబ్ కల్చర్‌లో ఎప్పటి నుంచో ఉంది. అయితే కరోనా తరువాత ఈ పదం బాగా పాపులర్ అయింది. తమ షిఫ్ట్ టైమింగ్స్ తర్వాత పని చేసేది లేదని డైరెక్ట్‌గా చెప్పడమే క్వైట్ క్విటింగ్. అంటే ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయరు. అయితే కంపెనీ ఆశించిన స్థాయిలో పనిచేయరు.

ఇది కూడా చదవండి : ఎనిమిదో తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్.. రూ. 63,000 వరకు జీతం..

కేవలం తమ పని ఎంతో అంత వరకే చూసుకుంటారు. షిఫ్ట్ టైమ్ ముగిసిన వెంటనే ఆఫీస్ నుంచి వెళ్లిపోవడం, ఓవర్‌టైమ్ బెనిఫిట్స్ కోరడం, వర్క్‌లో ప్రత్యేక చొరవ తగ్గించడం, లీవ్స్ తీసుకుంటూ వర్క్‌‌కు దూరంగా ఉండడం, వర్క్ లైఫ్‌ బౌండరీస్ ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇవ్వన్నీ క్వైట్ క్విటింగ్‌లోకి వస్తాయి. ఆల్టర్నేటివ్ వర్క్ స్ట్రక్చర్‌పై కంపెనీలు, ఉద్యోగులు పునరాలోచించడానికి కూడా అవకాశం కల్పించదని ఎక్స్‌ఫర్ట్స్ అంటున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, It companies, IT jobs, JOBS

ఉత్తమ కథలు