ఇండియాలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో జేఈఈ(JEE) మెయిన్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఏడాదికి రెండు సెషన్స్‌లో జరుగుతుంది. సెషన్-1 పరీక్షలు జనవరిలో జరగ్గా, ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. సెషన్-2 పరీక్షలు (Session -2 exams) వచ్చే నెల ఏప్రిల్ 6న ప్రారంభమై, 12వ తేదీన ముగియనున్నాయి. దీంతో జేఈఈ మెయిన్ సెషన్-2 ప్రిపరేషన్‌కు మరో కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. సెషన్-2లో బెస్ట్ స్కోర్ చేయడానికి సబ్జెక్ట్ వారీగా నిపుణులు సూచించిన ప్రిపరేషన్ టిప్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.
* మ్యాథమెటిక్స్
మ్యాథ్స్‌లో కోఆర్డినేట్ జామెట్రీ, కాలిక్యులస్, ఆల్జీబ్రా వంటివి ముఖ్యమైన చాఫ్టర్స్. వీటి నుంచే జేఈఈలో ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. దీంతో ఈ చాఫ్టర్స్‌లోని ప్రధాన టాపిక్స్‌ను రివైజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మల్టిపుల్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్‌కు సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ను ప్రాకీస్ట్ చేయాలి. ట్రిగ్నామెట్రి & కో-ఆర్డినేట్ జామెట్రిలో ముఖ్యమైన ఫార్ములాలు, కాలిక్యులస్‌లో డెఫినైట్ ఇంటిగ్రల్స్, వెక్టర్స్ & 3D- జామెట్రిపై మంచి పట్టు సాధించాలని నిపుణులు పేర్కొన్నారు.
* కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో ముఖ్యమైన టాపిక్స్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ కైనటిక్స్, కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, ఆల్డిహైడ్స్ & కీటోన్స్ తదితర వాటిపై ప్రిపరేషన్‌లో ప్రధానంగా ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రతి టాపిక్ కాన్సెప్ట్, అప్లికేషన్‌ను అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలని నిపుణులు అడ్వైజ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ రియాక్షన్స్, పార్ములాస్, కాన్సెప్ట్స్‌తో నోట్స్ తయారు చేసుకోని, రెగ్యులర్‌గా రివిజన్ చేయండి.
* ఫిజిక్స్
ఫిజిక్స్‌లో ప్రతి కాన్సెప్ట్ బేసిక్స్, ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈలో ఫిజిక్స్ మంచి వెయిటేజీ ఉన్న సబ్జెక్ట్. ప్రధానంగా ఫార్ములాలు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్‌పై ఫోకస్ చేయాలి. ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్స్ ప్రతిరోజు రివిజన్ చేయాలని నిపుణులు పేర్కొన్నారు. మేజర్ ఛాప్టర్స్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా మెకానిక్స్, హీట్ & థర్మోడైనమిక్స్, వేవ్ ఆప్టిక్స్, మోడరన్ ఫిజిక్స్, సెమీకండక్టర్స్ & కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని నిపుణులు సూచించారు.
* జనరల్ ట్రిప్స్
ఈ మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి గత జేఈఈ పేపర్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ పై పట్టు సాధించవచ్చు. జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌కు ప్లాన్ ప్రకారం షెడ్యూల్ ఏర్పర్చుకుని, రెగ్యులర్‌గా దాని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయాన్ని కేటాయిస్తూ, క్రమం తప్పకుండా రివిజన్ చేయాలని పేర్కొన్నారు. ప్రిపరేషన్ మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోని మ్యూజిక్ వినడం, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వల్ల ఏకాగ్రత పెరిగి ప్రిపరేషన్‌పై మరింత ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. తద్వారా పరీక్ష సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Exam Tips, JEE Main 2023, JOBS