హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC NET: యూజీసీ నెట్-2022 ఫేజ్-3 పరీక్షల రీ-షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీల వివరాలు ఇవే..

UGC NET: యూజీసీ నెట్-2022 ఫేజ్-3 పరీక్షల రీ-షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీల వివరాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

UGC NET ఫేజ్-3 పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతాయంటే..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (Junior Fellowship), అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టుల కోసం అర్హత పరీక్షగా నిర్వహించే యూజీసీ నె‌ట్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది ఎన్‌టీఏ. UGC NET ఫేజ్-3 పరీక్షల రీ షెడ్యూల్ తాజాగా వెలువడింది. ఇటీవల ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్‌తో పాటు ఫేజ్ 3 పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి. ఫేజ్-2 అడ్మిట్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కరోనా కారణంగా యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్షలను నిర్వహించలేదు. దీంతో ఈ రెండిటిని విలీనం చేస్తూ యూజీసీ నెట్-2022 పేరుతో వివిధ దశల్లో పరీక్షలను నిర్వహిస్తోంది. కాగా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం ప్రతి సంవత్సరం UGC NET పరీక్షను ఎన్‌టీఏ రెండుసార్లు నిర్వహిస్తుంది. యూజీసీ-నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 విలీనాలకు సంబంధించిన మొదటి ఫేజ్ పరీక్షలు జులై 9-12 వరకు, దేశవ్యాప్తంగా 225 నగరాల్లో 310 సెంటర్లలో జరిగాయి. మొత్తంగా 33 సబ్జెక్టులపై నెట్ పరీక్ష జరిగింది.

* సీబీటీ విధానంలో పరీక్ష..

యూజీసీ నెట్-2022 ఫేజ్-3 అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ సిటీ స్లిప్స్, అడ్మిషన్ కార్డ్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రిలీజ్ అయిన తరువాత అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్ సైట్‌లో లాగిన్ అయి సిటీ స్లిప్, అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతాయి. ప్రస్తుతానికి, ఫేజ్-3 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులు విడుదల కాలేదు. నిర్ణీత గడువులోగా UGC NET వెబ్‌సైట్‌లో అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : ఎంత ట్రై చేసిన జాబ్ రావట్లేదా? అయితే.. ఈ 6 టిప్స్ పాటిస్తే జాబ్ పక్కా.. ఓ లుక్కేయండి

* అభ్యంతరాలను తెలపడానికి..

అభ్యర్థులకు ఎన్‌టీఏ కొన్ని సూచనలు చేసింది. పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్ కోసం NTA వెబ్‌సైట్ nta.ac.in, UGC NET వెబ్‌సైట్ ugcnet.nta.nic.inను తరచూ చెక్ చేస్తుండాలని సూచించింది. పరీక్షలకు సంబంధించిన వివరణల కోసం అభ్యర్థులు ugcnet@nta.ac.inకు ఇమెయిల్ చేయవచ్చు లేదా 01140759000ద్వారా NTA హెల్ప్ డెస్క్‌కి కాల్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

* ఫేజ్ 2 పరీక్షలు ఎప్పుడంటే?

ఈ పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో జరగనుంది. సెప్టెంబరు 20, 21, 22 తేదీల్లో జరిగే ఫేజ్-2 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, Exams, JOBS, UGC NET