Home /News /jobs /

HERE IS THE LIST OF INSTITUTES OFFERING FREE COACHING AND SCHOLARSHIPS FOR UPSC CIVIL SERVICES PREPARATION NS

UPSC Civil Services Free Coaching: సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఫ్రీ కోచింగ్ అందిస్తున్న ఈ సంస్థల గురించి తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త. అనేక సంస్థలు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. ఆ వివరాలివే..

    దేశంలోనే అత్యున్నతమైన పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్ అన్న విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తారు. విభిన్న ఆర్థిక, విద్యా నేపథ్యాలున్న దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు ఏటా ఈ పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. అయితే, సివిల్ సర్వీసెస్ లో ఎంపికవడం అంత సులభం మాత్రం కాదు. దీని కోసం కఠోర శ్రమ, పక్కా ప్రణాళిక, సరైన గైడ్లైన్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో నిపుణలతో శిక్షణ తీసుకోవడం ద్వారా మీ ప్రిపరేషన్ కు ఎంతగానో లాభిస్తుంది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన వారికి సైతం సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావాలనే తపన ఉన్నప్పటికీ.. కోచింగ్ ఫీజు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. అటువంటి, అభ్యర్థులు వారి కలను సాకారం చేసుకునేందుకు అనేక ప్రైవేట్, ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. వారికి ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్‌ అందిస్తాయి. ఏ ఏ సంస్థల్లో ఉచిత కోచింగ్ అందిస్తున్నారు? ఈ సంస్థల్లోకి ఎలా ప్రవేశం పొందాలి? తదితర వివరాలు మీ కోసం..
    TSPSC: అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. ఆ వివరాలు నమోదు చేయాలని సూచన
    Ministry of Defence recruitment 2021: రక్షణ మంత్రిత్వ శాఖలో 458 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

    యూపి ముఖమంత్రి అభ్యుదయ యోజన 2021, ఉత్తర ప్రదేశ్
    రాష్ట్ర యువతకు వివిధ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించేందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఈ స్కీమ్ కేవలం ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రానికి చెందిన వారికే వర్తిస్తుంది. బిపిఎల్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్ కింద ఉచిత కోచింగ్ పొందటానికి అర్హులు. సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం- abhyuday.up.gov.in ని సందర్శించండి.

    అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ, అలీగఢ్
    AMU మెరిట్-కమ్- ఫ్రీస్షిప్ ప్రోగ్రామ్ ప్రతి ఏటా 100 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్, రెసిడెన్షియల్ సౌకర్యాలను అందిస్తుంది. ఇది మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపు ఉన్న వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం AMU అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సహకారంతో ఉచిత కోచింగ్, స్కాలర్షిప్ వంటివి అందిస్తున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Government jobs, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు