హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Civil Services Free Coaching: సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. ఈ సంస్థల్లో ఫ్రీ కోచింగ్.. తెలుసుకోండి

UPSC Civil Services Free Coaching: సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. ఈ సంస్థల్లో ఫ్రీ కోచింగ్.. తెలుసుకోండి

సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. ఈ సంస్థల్లో ఫ్రీ కోచింగ్.. తెలుసుకోండి

సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. ఈ సంస్థల్లో ఫ్రీ కోచింగ్.. తెలుసుకోండి

UPSC: మీరు సివిల్ సర్వీసెస్ (UPSC Civil Services) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? కోచింగ్ ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే.. మీకు శుభవార్త. అనేక సంస్థలు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఇంకా చదవండి ...

  దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS) పోస్టుల భర్తీకి ఏటా సివిల్ సర్వీసెస్ (Civil Services)  పరీక్ష నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. విభిన్న ఆర్థిక, విద్యా నేపథ్యాలున్న దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు ఏటా ఈ పరీక్షలకు (Exams) హాజరవుతుంటారు. అయితే, సివిల్ సర్వీసెస్ లో ఎంపికవడం అంత ఈజీ కాదు. దీని కోసం కఠోర శ్రమ, పక్కా ప్రణాళిక, సరైన గైడ్లైన్ చాలా అవసరం. అందువల్ల, నిపుణలచే శిక్షణ తీసుకోవడం ద్వారా మీ ప్రిపరేషన్ కు ఎంతగానో లాభిస్తుంది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన వారికి సైతం సివిల్ సర్వీసెస్(Civil Services) కు ప్రిపేర్ కావాలనే తపన ఉన్నప్పటికీ.. కోచింగ్ ఫీజు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. అటువంటి, అభ్యర్థులు వారి కలను సాకారం చేసుకునేందుకు అనేక ప్రైవేట్, ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. వారికి ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్‌ అందిస్తాయి. ఏ ఏ సంస్థల్లో ఉచిత కోచింగ్ అందిస్తున్నారు? ఈ సంస్థల్లోకి ఎలా ప్రవేశం పొందాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

  సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అహ్మదాబాద్

  కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రవేశానికి గుజరాత్ ప్రభుత్వం 2013లో సర్దార్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (SPIPA) ఏర్పాటు చేసింది. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇస్తుంది. ట్యూషన్ ఫీజు లేనప్పటికీ అభ్యర్థులు లైబ్రరీ డిపాజిట్‌గా రూ .2000, ట్రైనింగ్ డిపాజిట్‌గా రూ .5000 చెల్లించాలి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాలకు spipa.gujarat.gov.in సందర్శించండి.

  Law Coaching: లా చేయాలనుకుంటున్న వారికి శుభవార్త.. అడ్మిషన్ టెస్ట్ కోసం ఫ్రీ కోచింగ్.. వివరాలివే

  జామియా హమ్‌దార్డ్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ, న్యూ ఢిల్లీ

  ఈ అకాడమీ సివిల్ సర్వీసెస్ ఆశావాదులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా సివిల్స్ కోచింగ్ అందిస్తుంది. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2021 సెప్టెంబర్‌లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి.

  Courses: విద్యార్థుల్లో ఆ కోర్సుల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

  ఆల్ ఇండియా కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, చెన్నై

  ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ అన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్కు చెందిన అనుబంధ సంస్థ. ఇది ఏటా ఇన్స్టిట్యూట్ 325 మందికి (225 రెసిడెన్షియల్, 100 నాన్-రెసిడెన్షియల్) ఉచిత శిక్షణ ఇస్తుంది. ఈ ఉచిత కోచింగ్ తమిళనాడు యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ ఉచిత కోచింగ్కు ఎంపిక చేస్తారు. Civilservicecoaching.com వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Civil Services, IPS, UPSC

  ఉత్తమ కథలు