హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Gaming Industry: గేమింగ్ ఇండస్ట్రీలో స్థిర పడాలనుకుంటున్నారా? అయితే.. ఈ బెస్ట్‌ కోర్సులపై ఓ లుక్కేయండి

Gaming Industry: గేమింగ్ ఇండస్ట్రీలో స్థిర పడాలనుకుంటున్నారా? అయితే.. ఈ బెస్ట్‌ కోర్సులపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీ ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లు ఉంటున్నాయి. ఫోన్లలో గేమ్స్ ఆడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్‌తో గేమింగ్‌ కంపెనీలు కొత్త కొత్త గేమ్స్‌ లాంచ్‌ చేస్తున్నాయి. ఈ రంగంలో జాబ్స్‌ కూడా పెరుగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుతం టెక్నాలజీకి (Technology) ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోని పనులన్నీ టెక్నాలజీతో ముడిపడి ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతీ ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు (Smartphones), గ్యాడ్జెట్లు ఉంటున్నాయి. ఫోన్లలో గేమ్స్ ఆడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్‌తో గేమింగ్‌ కంపెనీలు (Gaming Companies) కొత్త కొత్త గేమ్స్‌ లాంచ్‌ చేస్తున్నాయి. ఈ రంగంలో జాబ్స్‌ (Jobs) కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలేంటి, యువత గేమిండ్ ఇండస్ట్రీని కెరీర్‌‌గా ఎంచుకుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాల్లో ఏదైనా సందేహాలుంటే మీరు న్యూస్ 18 డాట్ కామ్‌ను ట్విట్టర్ వేదికగా అడగవచ్చు.

అభివృద్ధి చెందుతున్న గేమింగ్ ఇండస్ట్రీ

ఏయే రంగాల్లో యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయో న్యూస్ 18 ప్రతీ వారం తెలుపుతుంది. ఈ వారం గేమింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తుంది. గ్లోబల్ వీడియో గేమ్స్ ఇండస్ట్రీ విలువ రోజురోజుకు పెరుగుతుంది. 2021 వరకు గేమింగ్ ఇండస్ట్రీ వ్యాల్యూ $214 బిలియన్లుందని, అది 2026 కల్లా $321 బిలియన్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ(PwC) సంస్థ తాజా నివేదికలో స్పష్టం చేసింది. భారతదేశంలో పలు నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గేమింగ్ ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ అవుతుంది.

5G Mobile Gaming: 5Gతో ఇండియాలో మొబైల్ గేమింగ్ రంగం పరుగులు.. పూర్తి వివరాలివే..

గేమ్ డిజైనర్లకూ ఫుల్ డిమాండ్

ప్రొడక్ట్ మేనేజర్‌తో పాటు గేమ్ డిజైనర్లకూ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో పలు సంస్థలు గేమ్ డిజైన్ కోర్సులను అందిస్తున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) టాయ్ & గేమ్ డిజైన్‌లో M.Des ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ గేమ్ డిజైన్ కూడా ఉంది. ఇందులో 2D &3D ఆర్ట్, మోడలింగ్, రైటింగ్, యూఐ డిజైన్, సౌండ్ డిజైన్, పీసీ గేమ్ మేకింగ్ వంటి విషయాలను నేర్పించనున్నారు. ఐఐటీ ఢిల్లీ , ముంబై లో మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటరాక్షన్ డిజైన్ కోర్సులు ఉన్నాయి. బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ, బీఎంఎం ఇన్ యానిమేషన్, బీఎస్‌సీ(విజ్యువల్ కమ్యూనికేషన్), ఎంఎస్‌సీ( విజ్యువల్ కమ్యూనికేషన్), బీ.డిజైన్ ఇన్ యానిమేషన్ కోర్సులు చేసి అభ్యర్థులు గేమింగ్ ఇండస్ట్రీలో చక్కగా సెటిల్ కావచ్చు. అయితే, గేమింగ్ ఇండస్ట్రీలోకి వెళ్లాలనుకునే వారు తొలుత గేమ్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. గేమ్స్ ఆడే ప్లేయర్స్ ఏయే విషయాల పట్ల ఆసక్తి చూపుతారు, వారికి ఏం కావాలి? అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

గేమింగ్ కోర్సులు

ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సును ఇండియాలోని పలు ఐఐఎం(IIM), ఐఎస్‌బీ(ISB) అందజేస్తున్నాయి. ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులకు డిజైన్ సెన్స్ ఉంటే మంచిది. అనలైటికల్ ఎబిలిటీతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వారు ప్రొడక్ట్ మేనేజర్‌గా చక్కగా రాణిస్తారు.

విదేశాల్లోనూ అవకాశాలు

మన దేశంతో పాటు విదేశాల్లోనూ గేమింగ్ ఇండస్ట్రీలో యువతకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గేమ్ మేకింగ్ నుంచి మొదలుకుని టెస్టింగ్ వరకు అభ్యర్థుల బలం, ఆసక్తిని బట్టి రకరకాల విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. గేమ్‌ను సక్సెస్ ఫుల్‌గా మార్కెట్‌లో లాంఛ్ చేయాలంటే గేమ్ స్టూడియో(Game Studio) కావాల్సి ఉంటుంది. అందులో పని చేసే అభ్యర్థులు ఈ నైపుణ్యాలు తప్పనిసరి. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, గేమ్ డిజైన్, యూఎక్స్ డిజైన్, ఆర్ట్, యానిమేషన్, గేమ్ ప్రోగ్రామర్, గేమ్ టెస్టర్, గేమ్ ప్రొడ్యూసర్..ఈ విషయాలన్నిటిలో నైపుణ్యమున్న వారికి చక్కటి శాలరీ ఉంటుంది. గేమ్ డిజైనర్లు ప్రొడక్ట్ మేనేజర్లుగా కూడా వర్క్ చేయవచ్చు. పలు సంస్థలు అందుకు అవకాశం ఇస్తున్నాయి.

First published:

Tags: Career and Courses, Gaming, IT jobs, JOBS, Private Jobs

ఉత్తమ కథలు