HERE IS THE LIST OF 4 SCHOLARSHIP PROGRAMMES THAT STUDENTS NEED TO APPLY IN THIS DECEMBER MONTH NS
Scholarship Programmes in Dec: విద్యార్థులకు అలర్ట్.. డిసెంబర్ లో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్షిప్ ల వివరాలివే..
విద్యార్థులకు అలర్ట్.. డిసెంబర్ లో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్షిప్ ల వివరాలివే..
పేద విద్యార్థులకు (Students) అండగా నిలిచేందుకు అనేక ప్రముఖ సంస్థలు స్కాలర్ షిప్ (Scholarship) అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ నెలలో విద్యార్థులు అప్లై చేసుకోవాల్సిన పలు స్కాలర్ షిప్ ల వివరాలు..
పేద విద్యార్థులకు (Students) ఆర్థికంగా సహాయం అందించి.. వారు ఉన్నత విద్యను పూర్తి చేయడానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వాలతో పాటు అనేక సంస్థలు స్కాలర్ షిప్ లు (Scholarships) అందించి ప్రోత్సహిస్తున్నాయి. ఈ కరోనా (Corona) సమయంలో అనేక మంది పేరెంట్స్ జాబ్స్ కోల్పోవడంతో (Job Loss) వారి పిల్లల విద్య ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చాయి. ఆయా విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ లను సద్వినియోగం చేసుకుంటే వారి విద్యను సజావుగా సాగించవచ్చు. ఈ నేపథ్యంలో పలు స్కాలర్ షిప్ ల వివరాలు..
1. HDFC Ltd's Badhte Kadam Scholarship 2021-22:9వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ స్కాలర్ షిప్ ప్రారంభించబడింది. ముఖ్యంగా ఈ కరోనా కారణంగా ఆర్థికంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులకు చేయూతనందించేందుకు ఈ స్కాలర్ షిప్ ను తీసుకువచ్చారు. అర్హతలు: కరోనా కారణంగా పేరెంట్స్ లేదా సంపాధించే కుటుంబ పెద్దను కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు.
-అభ్యర్థులు ప్రస్తుతం 9 నుంచి గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉండాలి.
-కుటుంబ ఆర్థిక ఆదాయం రూ.6 లక్షల కంటే ఎక్కువ ఉండొద్దు.
ఎంపికైన వారికి రూ. లక్ష వరకు స్కాలర్ షిప్ అందిస్తారు. అప్లికేషన్:ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 2, 2022 ఆఖరి తేదీ.
అయితే విద్యార్థులు కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-విద్యార్థులు ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. Google Scholarship: విద్యార్థినులకు రూ.74,000 స్కాలర్షిప్ ప్రకటించిన గూగుల్... అప్లై చేయండి ఇలా
2. STFC India Meritorious Scholarship Programme 2021:శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ(STFC) స్కాలర్ షిప్ సంస్థ ఆర్థికంగా వెనుకబడిక కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కుటుంబాల్లోని పిల్లలకు సహాయం అందించేందుకు స్కాలర్ షిప్ అందిస్తున్నారు. అర్హతలు:డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు లేదా గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు టెన్త్ మరియు ఇంటర్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు ఐటీఐ/పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సులకు రూ. 15 వేలు ఇంజనీరింగ్/గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారికైనతే ఏడాదికి రూ. 35 వేలు అందిస్తారు. అప్లికేషన్:ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ లింక్ ద్వారా స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. Scholarship: కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారా..? అయితే ఈ స్కాలర్షిప్ మీ కోసమే
3. Virchow Scholarship Programme 2021:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వెనకబడిన కుటుంబాలకు చెందిన పేద బాలికలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ స్కాలర్ షిప్ ను ప్రకటించారు. అర్హతల వివరాలు:10, 12 వ తరగతి పాసైన వారు లేదా ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న వారు లేదా గ్రాడ్యుయేషన్/డిప్లొమా చేస్తున్న వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-ఆయా స్కాలర్ షిప్ కు అప్లై చేయాలనుకుంటున్న వారి వార్షిక ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలి.
-ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి ఏడారికి రూ. 15 వేల స్కాలర్ షిప్ అందిస్తారు.
అప్లికేషన్:అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నేరుగా ఈ లింక్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.