ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి (IT layoffs 2023). మరికొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు జీతాల్లో కోతలు వేస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే త్వరలో ప్రపంచ దేశాలను మరోసారి ఆర్థికమాంద్యం కుదిపేయనుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యంతో (recession) ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. మరలా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపించడం ఆర్థిక మాంద్యం చాయలను గుర్తుకు తెస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు జీతాల్లో కోతలు వేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇచ్చిన అపాయింట్మెంట్లను రద్దు చేసుకుంటున్నాయి. మాంద్యం ముంచుకొస్తేందనే సూచనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మాంద్యం సమయంలో ఖర్చులు భారీగా తగ్గించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తోన్న విధానం. ఇప్పడు బహుళజాతి కంపెనీల నుంచి బీపీవో కంపెనీల దాకా ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, టెస్టర్‌లు, ప్రొడక్షన్ సపోర్ట్, సిస్టమ్ అడ్మిన్‌లు, మేనేజర్‌లతో సహా అనేక సబ్-టీమ్‌లల్లో అధిక వేతనం పొందే వారిపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. కొన్ని విభాగాలు ఆటోమేషన్ చేయడంతో అక్కడ కూడా సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. హెచ్ఆర్, ప్రాజెక్ట్, పీపుల్ మేనేజ్మెంట్ విభాగాలు ముఖ్యంగా ఆటోమేషన్ చేశారు. ఇందులో సిబ్బందిని భారీగా తగ్గిస్తున్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయడం ప్రారంభించారు. దీంతో చాలా కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. అలాంటి కొన్ని కంపెనీలు భారీగా అద్దెలు చెల్లించే పనిలేకుండా ఇప్పటికీ సిబ్బందిని ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అంగీకరిస్తున్నాయి. వారికి కావాల్సిన ఇంటర్నెట్, ల్యాప్ ట్యాప్ సదుపాయాలు కల్పిస్తున్నాయి.
Amazon Layoffs: 18 నుంచి అమెజాన్ లేఆఫ్స్ అమలు.. ఇండియాలో దాదాపు 1000 మందిపై వేటు..
ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే?
ఐటీ ఉద్యోగులు వారి ఉద్యోగాలు కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలోనూ ఐటీలో భారీగా ఉద్యోగాల కోత వేస్తున్నారు. మరోవైపు వీసాల గడవు ముగుస్తూ ఉండటంతో నిరుద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. 60 రోజుల్లో ఉద్యోగంలో చేరకుంటే వీసా గడవు ముగిసిపోతుంది. అలాంటి హెచ్ 1బి వీసా కలిగిన లక్షలాది మంది మరలా స్వదేశాలకు చేరుకోవాల్సి వస్తోంది. ప్రాజెక్టులు తగ్గిపోవడంతో బహుళజాతి కంపెనీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో ముందుగా సిబ్బందిని తొలగిస్తున్నారు. మరలా ప్రాజెక్టులు పుష్కలంగా వచ్చిన తరవాత వారిని తీసుకునే అవకాశం లేకపోలేదు.
అప్పటి వరకు మరో ఉద్యోగ ప్రయత్నం చేసుకోవడంతోపాటు, ఉద్యోగంలో ఉండగానే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సదరు ఉద్యోగి కంపెనీలో కీలకంగా మారితే త్వరగా తొలగించరని, ఆ వ్యక్తి లేకపోయినా పరవాలేదు, ప్రాజెక్టులకు ఆటంకం కలగదని భావిచింనప్పుడే వారిపై వేటు వేస్తుంటారని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఉద్యోగంలో ఉన్న వారు రిలాక్స్ అవక్కుండా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, కొత్త కోర్సులు నేర్చుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IT jobs, JOBS, Lay offs