కరోనా పరిస్థితుల కారణంగా 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి మార్కుల కేటాయింపుపై గత కొన్ని రోజులుగా బోర్డు అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులకు మార్కులు కేటాయించడానికి 40:30:30 ఫార్ములాను అనుసరిస్తామని సీబీఎస్‌ఈ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇంతకీ ఏంటీ ఫార్ములా, మార్కుల లెక్కింపు ఎలా జరుగుతుంది, దీనిపై విద్యార్థులు ఏమంటున్నారో చూద్దాం! 40:30:30 ఫార్ములా అంటే... ఓ విద్యార్థికి పదో తరగతి, 11వ తరగతి, 12వ తరగతిలో వచ్చిన మార్కులను వరుసగా 40:30:30 నిష్పత్తిలో వేసి తుది మార్కులు లెక్కిస్తారు. ఈ క్రమంలో 12వ తరగతి ప్రీ బోర్డ్ లేదా మిడ్ టర్మ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఇందులో తీసుకుంటారు. దీంతోపాటు పది, పదకొండో తరగతుల్లో.. ఫైనల్ ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండు తరగతుల మార్కులను 12వ తరగతి మార్కుల్లో కలిపి ఫైనల్ మార్కుల జాబితాను విడుదల చేస్తారు.
CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల కేటాయింపు ఇలా.. జులై 31లోగా ఫలితాలు.. వివరాలివే
TS EAMCET-2021: ఐదో సారి ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. వివరాలివే..
మార్కులు ఎలా లెక్కిస్తారంటే?
12వ తరగతి మార్కులకు యూనిట్ టెస్టులు, మిడ్ టర్మ్ లేదా ప్రీ బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ మార్కులను రిజల్ట్ కమిటీలు నిర్ణయిస్తాయి. ఆ కమిటీలో స్కూల్ ప్రిన్సిపల్, ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు ఉంటారు. దీంతోపాటు 12వ తరగతి పాఠాలను బోధించే ఇద్దరు వేరే స్కూలు టీచర్లు ఉంటారు. ఇక 11వ తరగతి మార్కుల సంగతి చూస్తే... ఫైనల్ థియరీ ఎగ్జామ్స్‌లో మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. పదో తరగతి సంగతి చూసుకుంటే... ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించిన మూడు మెయిన్ సబ్జెక్ట్స్‌లోని మార్కుల సగటును తీసుకుంటారు. చాలా పాఠశాల్లలో 12వ తరగతి ఇంటర్నల్ పరీక్షలు అయిపోయాయి. ఇంకా పరీక్షలు జరగని పాఠశాలల్లో వెంటనే ఆన్‌లైన్ టెస్టులు నిర్వహించనున్నారు.
తక్కువ మార్కులు వస్తే..
40:30:30 ఫార్ములా ప్రకారం తక్కువ మార్కులు వచ్చినవారిని కంపార్టెమెంట్ కేటగిరీలో పెడతారు. ఒక్క సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వస్తే కంపార్ట్‌మెంట్ కేటగిరీ అంటారు. వారికి త్వరలో పరీక్ష పెట్టి పాస్ అయ్యే అవకాశం కల్పిస్తారు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్‌లో తక్కువ మార్కులు వస్తే వారిని ఎసెన్సియల్ రిపీట్ కేటగిరీలో వేస్తారు. 40:30:30 విధానం ప్రకారం తక్కువ మార్కులు వచ్చాయి అని భావించే విద్యార్థులకు సీబీఎస్‌ఈ మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. వారి కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగి, పరీక్షలు నిర్వహించే పరిస్థితి వచ్చినప్పుడు, ఈ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. ఇందులో వచ్చే మార్కులనే ఫైనల్ మార్కులుగా నిర్ణయిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, Exams