హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarships: రిసెర్చ్​ కోసం మూడు అత్యుత్తమ స్కాలర్‌షిప్​లు.. అర్హత, దరఖాస్తు వివరాలివే..

Scholarships: రిసెర్చ్​ కోసం మూడు అత్యుత్తమ స్కాలర్‌షిప్​లు.. అర్హత, దరఖాస్తు వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్​షిప్​లను అందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలైతే వివిధ అంశాల్లో పరిశోధనలు (రిసెర్చ్​) చేసే వారిని ప్రోత్సహించేందుకు ఫెలోషిప్​ కూడా ఇస్తున్నాయి.

ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్​షిప్​లను అందజేస్తున్నాయి. మరికొన్ని సంస్థలైతే వివిధ అంశాల్లో పరిశోధనలు (రిసెర్చ్​) చేసే వారిని ప్రోత్సహించేందుకు ఫెలోషిప్​ అందిస్తున్నాయి. జూన్​ నెలాఖరు లోపు దరఖాస్తు చేసుకోవాల్సిన మూడు ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లపై ఓలుక్కేయండి.

Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. విదేశాల్లో ఉన్నత విద్యకు రూ. 20 లక్షల సాయం.. ఇలా అప్లై చేసుకోండి

1. ఐఐటి గాంధీనగర్ ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్​

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), గాంధీనగర్​ డాక్టోరల్ డిగ్రీ హోల్డర్లకు ప్రత్యేకంగా ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్​ను అందిస్తోంది. 2021 ఏడాదికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

అర్హత

డాక్టోరల్ డిగ్రీ లేదా పీహెచ్​డీ చేసిన అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ డాక్టోరల్ థీసిస్‌ను సమర్పించి ఉండాలి. ఈ ఫెలోషిప్​కు ఎంపికైన వారికి నెలకు లక్ష రూపాయలు అందజేస్తారు. దీని కోసం జూన్​ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కేవలం ఈ–మెయిల్ ద్వారానే పంపించాలి. మరిన్ని వివరాలకు https://iitgn.ac.in/research/early_career_fellowship వెబ్​సైట్​ను సందర్శించండి.

2. క్రెడిట్ సూయిస్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

ఇంజనీరింగ్ / ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థుల నుంచి క్రెడిట్​ సూయిస్​ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దీని కోసం క్రెడిట్ సూయిస్ సంస్థ బడ్డీ 4 స్టడీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతిభ గల విద్యార్థులు ఉన్నవిధ్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్కాలర్​షిప్​ను అమలు చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు మొత్తం ట్యూషన్​​ ఫీజు చెల్లిస్తుంది.

అర్హత

దరఖాస్తుదారులు ఇంజనీరింగ్/ ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్​ పొంది ఉండాలి. ఇంటర్మీడియట్​ లేదా గ్రాడ్యుయేషన్​లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 5,00,000 కన్నా మించదాదు. ఈ స్కాలర్​షిప్​కు ఎంపికైన ఎంబీఏ విద్యార్థులకు తమ ట్యూషన్​లో ఫీజులో 80% లేదా 2,00,000 అందజేస్తారు. ఇక, ఇంజనీరింగ్ విద్యార్థులకైతే మొత్తం ట్యూషన్​ ఫీజులో 80% లేదా రూ.100,000 అందజేస్తారు. జూన్​ 15లోపు ఈ స్కాలర్​షిప్​కు దరఖాస్తు చేసుకోవాలి. www.b4s.in/it/CSE1 వెబ్​సైట్​లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు.​

3. SERB నేషనల్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్

సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) పోస్ట్ -డాక్టోరల్ అభ్యర్థుల కొరకు నేషనల్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (N-PDF) ప్రోగ్రామ్​ ప్రారంభించింది. యువ పరిశోధకులను గుర్తించి ప్రోత్సహించమే లక్ష్యంగా ఈ ఫెలోషిప్​ అందజేస్తుంది.

అర్హత

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి / ఎండి / ఎంఎస్ డిగ్రీ పొందిన వారెవరైనా ఈ ఫెలోషిప్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అభ్యర్థికి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలి. ఎంపికైతే రూ. 55,000 వరకు నెలవారీ స్టైఫండ్, ఇతర ప్రయోజనాలు అందుకోవచ్చు. జూన్​ 2లోపు ఈ ఫెలోషిప్​కు దరఖాస్తు చేసుకోవాలి. https://www.serbonline.in/SERB/npdf?HomePage=New వెబ్​సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: EDUCATION, Scholarship, Scholarships

ఉత్తమ కథలు