HERE IS THE APPLICATION PROCESS AND DETAILS ABOUT ADMISSION FOR JOURNALISM COURSE IN ANDHRA UNIVERSITY VISAKHAPATNAM PRN VSJ NJ
Journalism Course: జర్నలిజం చదవాలనుకుంటున్నారా..? అయితే మీకిదే మంచి ఛాన్స్..!
ప్రతీకాత్మకచిత్రం
ఎక్కడ చూసినా డిగ్రీ కాలేజీలు (Degree College), ఇంజనీరింగ్ కాలేజీ (Engineering Colleges) బోర్డులే కనిపిస్తాయి. కానీ జర్నలిజం చదవాలనుకున్న వాళ్లకు ఏ కాలేజ్ ఉంది. అసలు వాళ్లకు ఏమైనా కోర్సులు ఉన్నాయా..? ఇలాంటి మీ సందేహాలకు సమాధానమే విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University).
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) ఎక్కడ చూసినా డిగ్రీ కాలేజీలు (Degree College), ఇంజనీరింగ్ కాలేజీ (Engineering Colleges) బోర్డులే కనిపిస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ కోర్సులవైపే చూస్తుంటారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే జర్నలిజం వంటి కోర్సులు ఎంచుకుంటారు. ఐతే జర్నలిజం చదవాలనుకున్న వాళ్లకు ఏ కాలేజ్ ఉంది. అసలు వాళ్లకు ఏమైనా కోర్సులు ఉన్నాయా..? ఇలాంటి మీ సందేహాలకు సమాధానమే విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University). వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిలో ఎన్నో కోర్సులు ఉన్నాయి. వాటిలో ఒకటి జర్నలిజం. ఈ జర్నలిజం కోర్స్ జాయిన్ అవ్వడానికి డిగ్రీ ఉత్తిర్ణులైన విద్యార్థులు ఈ కింద పద్ధతులు ద్వారా అడ్మిషన్ పొందొచ్చు.
ప్రతి ఏడాది నోటిఫికేషన్ఆంధ్ర యూనవర్సిటీ ప్రతి ఏటా www.audoa.in వెబ్ సైట్ ద్వారా యూనివర్సిటీలో అన్ని పీజీ కోర్స్ లకు నోటిఫికేషన్ (notification) ఇస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా AUCET 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 22 నుంచి ప్రారంభం కాగా.. జూన్ 22 చివరితేది. అయితే రూ.750/- ఆలస్య రుసుముతో 26-06-22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
ఆంధ్రా యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AUCET 2022) అనేది విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఆంధ్రా యూనివర్శిటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం అనుబంధ కళాశాలలు అందించే టీచింగ్, కామర్స్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ మొదలైన వివిధ రంగాలలోని వివిధ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి ఇది నిర్వహించబడుతుంది.
మొదలైన AUCET 2022 దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 22 నుంచి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఆంధ్రా యూనిర్సిటీలో పీజీ చేయాలంటే..! ఏ డిగ్రీలోనైన ఉతీర్ణత సాధించిన విద్యార్థులు AUCET రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏ పీజీ కోర్స్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. జర్నలిజం ఆప్షన్ కోసం అందులోని 201 సోషల్ సైన్స్ పోర్టల్ పెట్టి ausetకి అప్లై (Apply) చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ అధ్వర్యంలోనే ఈ పరీక్ష జరుగుతుంది.
AUCET 2022 అర్హత, ప్రమాణాలివే..!
అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి.
అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విద్యా సంస్థలు 1974లో సవరించిన విధంగా రాష్ట్ర నివాసానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే రుజువును కలిగి ఉండాలి.
విద్యార్హతలు, అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో (రిజర్వ్డ్ కేటగిరీలకు 45శాతం) ఆంధ్రా యూనివర్సిటీకి సమానమైన గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షకు హాజరైన/హాజరయ్యే అభ్యర్థులు మాత్రమే అర్హులు.
AUCET 2022కి హాజరు కావడానికి వయోపరిమితి లేదు.
రిజర్వ్డ్ తరగతులకు (SC/ST) ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట అర్హత వయస్సు 34 మరియు EBC/మైనారిటీలు/వికలాంగ అభ్యర్థులకు 30 సంవత్సరాలు.
AUCET 2022 పరీక్ష తేదీలు పూర్తి షెడ్యూల్‌తో పాటు త్వరలో ప్రకటించబడతాయి. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
AUCET 2022 దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలి?
దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్లో మాత్రమే నింపాలి. AUCET 2022 కోసం దరఖాస్తు చేయడానికి..
మీ వివరాలు నమోదు చేసుకోవాలి: అధికారిక వెబ్సైట్ www.audoa.inకి వెళ్లండి. నమోదు చేసుకోవడానికి దిగువ జాబితా చేయబడిన అన్ని వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి. అభ్యర్థి పేరు, DOB (DD/MM/YYYY), మొబైల్ నెం., జాతీయత, ఈ-మెయిల్ ఐడి, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం (10వ, 12వ), తల్లిదండ్రుల పేర్లు, వర్గం (sc/st/ obc/జనరల్), ఆధార్ నెం, నమోదుపై క్లిక్ చేయండి. నమోదిత ఇమెయిల్ IDకి నిర్ధారణ ఇమెయిల్ పంపబడుతుంది. అందుకున్న ఆధారాలతో లాగిన్ చేయండి.
AUCET 2022 దరఖాస్తు ఫారమ్: “AUCET 2022 దరఖాస్తు ఫారమ్” లింక్‌పై క్లిక్ చేయండి. అడిగిన వ్యక్తిగత మరియు విద్యాపరమైన వివరాలను పూరించండి. భద్రతా ప్రశ్నను ఎంచుకుని, దానికి సమాధానం ఇవ్వండి.
మీ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీ పే చేయాలి. (General/Obc- 600/-, SC/ST/ PH-500/-)
AUCET 2022 Admit card
AUCET 2022 ఎగ్జామ్ రాసేందుకు అడ్మిట్ కార్డ్ ను ఏయూ అఫిషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వార్డ్ తో లాగిన్ అయితే మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.దరఖాస్తు చేసుకున్నా మీకు ఎలాంటి అడ్మిట్ కార్డు రాలేదు అంటే వెంటనే విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీని సంప్రదించండి లేదా అక్కడి అధికారులను ఈ కింద ఇచ్చిన ఈ మెయిల్ ద్వారా సంప్రదించండి. vicechancellor@andhrauniversity.info, registrar@andhrauniversity.info
AUCET 2022 ఎగ్జామ్ సెంటర్:
ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీలోని ఎనిమిది సిటీల్లో జరుగుతుంది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు. మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడే మీకు దగ్గరలోని సిటీని సెలక్ట్ చేసుకోండి.
MJMC వెబ్ ఆప్షన్ పెట్టాలి
ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా www.audoa.in ఈ వెబ్సైట్లో పెడతారు. పరీక్షలో ర్యాంకింగ్ ఆధారంగా యూనివ్సిటీలోని 10 కోర్సుల వరకు మీకు నచ్చినవి ప్రాధాన్యత ఆధారంగా ఆప్సన్ ఇచ్చుకోవొచ్చు. జర్నలిజం కావాలనుకునే వారు వెబ్ ఆప్షన్ లో MJMC (Master of Journalism and Mass Communication) ఆప్షన్ పెట్టాలి. వెబ్ ఆప్షన్ పెట్టిన వారం రోజుల తర్వాత కౌన్సిలింగ్ కి వెళ్ళవలసి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఆఫీస్ లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. సెలక్ట్ అయిన విద్యార్థులకి అడ్మిషన్ కార్డ్ ఇచ్చి అయా డిపార్ట్ మెంట్‌కి రిఫర్ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.