హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Preparation Tips: జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ 4 టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్.. అవేంటంటే?

JEE Preparation Tips: జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ 4 టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్.. అవేంటంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ (JEE) కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ 4 ముఖ్యమైన టిప్స్ పాటిస్తే అభ్యర్థులు బెస్ట్ రిజల్ట్స్ సాధించవచ్చని నపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ మీ కోసమే..

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ (JEE)కి సంబంధించి లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ పోటీ పరీక్షలో (Exam) విజ‌యం సాధించాలంటే ఎలాంటి టిప్స్ (Exam Tips) పాటించాలి సిల‌బ‌స్ లో ను ఎలా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అభ్యర్థులు పరీక్షలో సత్తా చాటే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం న్యూస్ 18 కొన్ని టిప్స్ అందిస్తోంది. ఆ టిప్స్ ఇవే..

స‌రైన పుస్త‌కాలు ఎన్నుకోండి..

వాస్తవానికి ఉపయోగకరమైన పుస్తకాలు ఏంటనేది అభ్యర్థులు తెలుసుకోవాలి. సాధారణంగా, NCERT పుస్తకాలను చాలా మంది సిఫార్సు చేస్తారు. కానీ వాటికంటే చాలా మంచి పుస్తకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏంటనేది సీనియర్స్ లేదా సబ్జెక్ట్ నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఆ పుస్తకాలను రిఫరెన్స్ కోసం వాడుకోవ‌చ్చు.

JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌లో బెస్ట్ స్కోర్ చేయాలా.. ఈ ప్రిపరేషన్ టిప్స్ ఫాలో అవ్వండి

JEE మెయిన్ పరీక్షా సరళిని అర్థం చేసుకోండి..

మీ JEE మెయిన్ ప్రిపరేషన్ సమయంలో.. మీరు పరీక్షా సరళి గురించి తెలుసుకోవాలి. దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మంచి ఫలితాన్ని సాధించడానికి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

JEE Tips: జేఈఈ అభ్యర్థులకు అలర్ట్.. ఈ టిప్స్ మీకోసమే..

సిలబస్ తెలుసుకోండి..

జేఈఈ మెయిన్ సిలబస్ ను పూర్తి స్థాయిలో తెలుసుకుని దానిపై అవగాహన పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సిలబస్ గురించి పూర్తి అవ‌గాహన పొంద‌డం ద్వారా మీరు ముఖ్యమైన అధ్యాయాలు, అంశాల గురించి తెలుసుకోవ‌డానికి వీలుప‌డుతుంది.

JEE Mains Preparation: జేఈఈ ప్రిపేర్ అవుతున్నారా.. ఫిజిక్స్‌లో మంచి స్కోర్ కోసం స్పెష‌ల్ టిప్స్‌


పాత‌ JEE ప్రశ్న పత్రాలను పరిష్కరించండి..

మీ JEE మెయిన్ ప్రిపరేషన్ సమయంలో, మీరు ప్రశ్న పత్రాలను నమూనా పత్రాలు లేదా మునుపటి సంవత్సరం పేపర్‌ల‌ను రిఫ‌రెన్స్ గా తీసుకోని వాటి ప‌రిష్క‌రించ‌డాన‌కి ప్ర‌య‌త్నించాలి. దీని వ‌ల‌న మీరు ప్రశ్నల సరళి, ప్రశ్నల రకాలు, పరీక్ష వ్యవధి వంటి అంశాల‌పై మీకు నెమ్మ‌దిగా అవ‌గాహన పెరుగుతుంది.

First published:

Tags: Exam Tips, Jee main 2022, JOBS