ప్రస్తుత రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వెబ్ డెవలప్‌మెంట్ ఒకటి. ఆకర్షణీయంగా వెబ్‌సైట్లను తయారు చేయడం, యూజర్లు సులభంగా ఉపయోగించేలా వాటిని తీర్చిదిద్దడం వెబ్ డెవలపర్ల పని. ఉద్యోగంలో చేరే ముందే వీటిలో ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా మంచి జీతాలతో కొలువు సాధించొచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్‌లో కూడా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఆ సంస్థలు ఏమిటి, దరఖాస్తు గడువు, స్టైఫెండ్ ఎంత వివరాలు తెలుసుకుందాం.
* లియోనార్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే
మూడు నెలల ఇంటర్న్‌షిప్ లేదా పార్ట్ టైం జాబ్. ఫిబ్రవరి 11లోగా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్ లేఅవుట్, యూజర్ ఇంటర్ ఫేజ్ క్రియేట్ చేయడం, బ్యాక్ అండ్ సర్వీసెస్ నుంచి డేటాను ఇంటిగ్రేట్ చేయడం, సాఫ్ట్‌వేర్ డాంక్యుమెంటేషన్ పనులు చేయాలి. నెలకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఇస్తారు.
* బ్రోకోడ్ ఐటీ కన్సల్టింగ్, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్
మూడునెలల ఇంటర్న్‌షిప్ లేదా వర్క్ ఫ్రం హోమ్ జాబ్. ఫిబ్రవరి 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త యూజర్ ఫేసింగ్ ఫీచర్లను డెవలప్ చేయడం, UI/UX డిజైన్లు, ఫంక్షనల్ రైటింగ్స్ వంటివి చేయాలి. నెలకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఇస్తారు.
* సేల్స్‌క్వీన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్
ఇదొక ప్రముఖమైన వెబ్‌డిజైన్, డెవలప్‌మెంట్ సంస్థ. ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ లేదా వర్క్ ఫ్రం హోమ్ జాబ్. ఫిబ్రవరి 11లోదా అప్లై చేసుకోవాలి. HTML/CSS ఉపయోగించి వెబ్‌సైట్ లేఅవుట్లు, యూజర్ ఇంటర్‌ఫేస్‌లు తయారుచేయాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాక్టీసెస్‌ను ఉపయోగించి కోడింగ్ రాయాలి. నెలకు 2,000 స్టైఫెండ్ ఇస్తారు.
* క్రియేటీవ్ ఫ్రై మీడియా, ఢిల్లీ
ఢిల్లీలో బాగా పేరొందిన కంపెనీల్లో ఒకటి అయిన క్రియేటీవ్ ఫ్రై మీడియా తమ సంస్థలో వెబ్ డెవలప్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం సంస్థ పోర్టల్ ద్వారా ఫిబ్రవరి 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్స్ చేయడం, ఆప్టిమైజేషన్, వెబ్‌సైట్ నిర్వహణ తదితర పనులు చేయాలి. ఎంపికైన వారికి నెలకు రూ.3,000 నుంచి రూ. రూ.8,000 వరకు స్టైఫండ్‌ను ఇస్తారు.
ఇది కూడా చదవండి : సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..!
* ALMI బ్లాగింగ్ స్కూల్, చెన్నై
ALMI బ్లాగింగ్ స్కూల్ ప్రొ (అల్మి ప్రొడక్షన్ ల్యాండ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ రెండు నెలల ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. కంపెనీ పోర్టల్‌లో ఫిబ్రవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. నగరాల్లో ఉండే అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్ తయారు చేయడం, నిర్వహించడం, HTTPS, వర్డ్‌ప్రెస్, ఈ-కామర్స్‌కు సంబంధించి పని ఉంటుంది. నెలకు రూ.3,000 స్టైఫండ్ ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Internship, JOBS