కరోనా (Corona) ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం (Work From Home) ప్రకటించాయి. దీంతో రెండున్నరేళ్లుగా లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వైరస్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఆఫీసుల (Work From Office) బాట పడుతున్నారు. అయితే.. ఇంటి దగ్గర రిలాక్స్ వాతావరణంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులు ఇప్పుడు ఆఫీస్ అంటేనే భయపడుతున్నారు. అన్ని గంటలకు ఓకే చోట కూర్చొని పని చేయగలుగుతామా? లేదా? అన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంగా మీరు ఫిట్‌గా ఉండటానికి ఈ చిట్కాలు పాటించండి.
1. యాక్టివ్ గా ఉండడం..
వర్క్ ఫ్రం హోం కారణంగా ఇంట్లో నుంచి బయలకు వెళ్లకపోవడంతో చాలా మంది అధికంగా బరువు పెరిగారు. దీంతో గతంలో మాదిరిగా యాక్టివ్ గా ఉండలేకపోతున్నామంటున్నారు. వారంతా ఇప్పుడు బరువు ఎలా తగ్గాలో అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే.. బరువు తగ్గడానికి ప్రజలు గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆఫీసులో ఎలివేటర్‌కు బదులుగా మెట్లను ఎంచుకోండి. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం కాకుండా నడవడం, మాట్లాడడం, మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నడవడం, కుర్చీలోంచి కాసేపు లేవడం వంటివి చేస్తే యాక్టివ్‌గా ఉండవచ్చు.
Work From Home Vs WFO: ఆఫీసులకు రమ్మంటే జాబ్స్ వదిలేస్తున్న ఎంప్లాయిస్.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..
2. ఆరోగ్యకరమైన చిరుతిండి
ప్రస్తుత జీవన విధానంలో 8-9 గంటలు పనిచేసినప్పుడు స్నాక్స్ తినడం సహజం. చిప్స్, కూల్ డ్రింక్స్, ఇతర అనారోగ్యకరమైన స్నాక్స్ తినడానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఎంచుకోండి. డ్రైఫ్రూట్స్, పండ్లు, కీరా మరియు ఇంట్లో తయారుచేసిన చిప్స్ ను స్నాక్స్ గా తినండి. మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా వీటిని తినవచ్చు. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది.
Software Employees: కీలక నిర్ణయం తీసుకున్న ఆ ఐటీ దిగ్గజం.. వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాలంటూ..
3. తగినంత నిద్ర
ఉద్యోగానికి వెళ్లడం మరియు ఆలస్యంగా తిరిగి రావడం కారణంగా మనలో చాలా మంది సరిపడ నిద్ర పోరు. వివిధ పనుల కారణంగా కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే మన శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఫిట్‌గా ఉండటానికి కనీసం 7-8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి. మీ శరీర శక్తిని క్షీణింపజేసే
4. నీరు తాగడం..
వర్క్ లో నిమగ్నమైనప్పుడు తరచుగా నీరు తాగడం మర్చిపోవద్దు. డీ హైడ్రేషన్ వల్ల మీకు కళ్లు తిరగడం మరియు నిద్ర వచ్చినట్లు అనిపించవచ్చు. కాబట్టి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ప్రతి గంటకు నీరు తాగాలి. వేసవి కాలం కావడంతో పుచ్చకాయ రసం, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, ఇతర ఆరోగ్యకర పానీయాలను కూడా ఆఫీసుకు తీసుకువెళ్తే మంచిది.
5. ఒత్తిడిని తగ్గించుకోండి
సాధారణంగా ఆఫీసుల్లో విపరీతమైన ఒత్తిడి వాతావరణం ఉంటుంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి. నడకకు వెళ్లండి. మధ్యమధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండండి. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఆఫీస్ విషయాలు కాకుండా ఇతర విషయాలను ఫోన్ లో కొద్ది సేపు చర్చించి రిలాక్స్ అవ్వండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Private Jobs, Work From Home, Work from office