హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ ఇవే..!

Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Scholarships: సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్‌ ఏవో పరిశీలిద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రతిభ ఉన్న విద్యార్థుల (Students)ను ప్రోత్సహించడానికి అనేక సంస్థలు స్కాలర్ షిప్స్ (Scholarships) ప్రకటిస్తుంటాయి. ఇవి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీజుల భారాన్ని తగ్గిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలనుకుంటున్న వారికి ఈ ఫెలోషిప్స్ చేదోడువాదోడుగా నిలుస్తాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్‌ ఏవో పరిశీలిద్దాం.

* కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ స్కాలర్‌షిప్

యువత తమ విద్య/కెరీర్ కలలను కొనసాగించడానికి మద్దతుగా కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ సంస్థ ఈ స్కాలర్ షిప్స్‌ను అందించనుంది. అర్హులైన అభ్యర్థులు www.b4s.in/it/KSSI2 ఈ లింక్ ద్వారా డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

నిరుపేద పిల్లలకు బోధించడం లేదా క్రీడా శిక్షణ అందిస్తూ ఉండాలి. క్రీడా విభాగానికి చెందిన వారైతే గత 2/3 సంవత్సరాలలో రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం/దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు సంవత్సరానికి రూ.75,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

* కోటక్ కన్యా స్కాలర్‌షిప్- 2022

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభ ఉన్న గర్ల్ స్టూడెంట్స్ యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించడానికి మద్దతుగా కోటక్ కన్యా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. కోటక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్.. CSR ప్రాజెక్ట్ కింద ఈ స్కాలర్‌షిప్‌లను అందజేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1.5లక్షల వరకు స్కాలర్ షిప్ అందనుంది.

న్యాక్/ఎన్‌ఐఆర్‌ఎఫ్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెషనల్ కోర్సుల్లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్‌కు ప్రవేశం పొందిన గర్ల్ స్టూడెంట్స్‌ ఈ స్కాలర్షిప్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. 12వ తరగతిలో 75% కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,20,000లోపు ఉండాలి. దీని కోసం www.b4s.in/it/KKGS12 ఈ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 30తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి : NSE అకాడమీతో UPES బిజినెస్ స్కూల్ ఒప్పందం.. విద్యార్ధులకు గోల్డెన్ ఛాన్స్..!

* జీఎస్‌కే స్కాలర్స్ ప్రోగ్రామ్ 2022-23

ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసమే జీఎస్‌కే స్కాలర్స్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వారికి 12వ తరగతిలో కనీసం 65శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1 లక్ష వరకు స్కాలర్‌షిప్ లభించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.b4s.in/it/GSKP2 ద్వారా అక్టోబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarships

ఉత్తమ కథలు