హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Options: ఇంటర్ తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. ఈ రంగాల్లో మంచి ఉద్యోగాలు..

Career Options: ఇంటర్ తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. ఈ రంగాల్లో మంచి ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Career Options: ప్రస్తుత రియల్ వరల్డ్‌లో టెక్నాలజీదే కీ రోల్. ఇందుకు సంబంధించిన రంగాల్లో ఉపాధి అవకాశాలు ఫ్యూచర్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటర్ తరువాత టెక్నాలజీకి సంబంధించిన ఏయే రంగాలు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు (Inter Exams) జరుగుతున్నాయి. త్వరలోనే ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలో కెరీర్ (Career) గురించి విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఉద్యోగవకాశాలు ఏ మేరకు ఉంటాయి? తదితర విషయాలపై విద్యార్థుల్లో సందేహాలు ఉంటాయి. కాబట్టి నిపుణులతో చర్చించి, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత రియల్ వరల్డ్‌లో టెక్నాలజీదే కీ రోల్. ఇందుకు సంబంధించిన రంగాల్లో ఉపాధి అవకాశాలు ఫ్యూచర్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటర్ తరువాత టెక్నాలజీకి సంబంధించిన ఏయే రంగాలు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయో పరిశీలిద్దాం.

* సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్

సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారు. సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్‌లలో థ్రెంట్స్, వల్నరబులిటీస్ గుర్తించడం, హ్యాకింగ్, మాల్వేర్ వంటి అన్ని రకాల సైబర్‌క్రైమ్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం హైటెక్ సొల్యూషన్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సేవలు, ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, రిటైల్ వంటి రంగాల్లో సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాలు డిజిటలైజేషన్ బాట పడుతుండడంతో సైబర్ థ్రెట్స్ పెరుగుతున్నాయి. దీంతో ఈ రంగంలో మంచి స్కిల్ ఉన్న వారికి జీతాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

* డిజిటల్ మార్కెటింగ్

ఇటీవల కాలంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగం డిజిటల్ మార్కెటింగ్. ఉపాధి అవకాశాలు ఈ రంగంలో పుష్కలంగా ఉన్నాయి. కంపెనీలు తమ వస్తు సేవలను సోషల్ మీడియా, ఇమెయిల్, బ్లాగ్స్, డిజిటల్ యాడ్స్ వంటి ఆన్‌లైన్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్‌ అంటారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం వినియోగదారులను ఆకట్టుకునేలా ఆన్‌లైన్‌లో యాడ్స్ క్రియేట్ చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది.

సంప్రదాయ మార్కెటింగ్ ఇప్పటికీ ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ, డిజిటల్ మార్కెటింగ్ వేగంగా దాన్ని భర్తీ చేస్తోంది. ఎందుకంటే ఇది మరింత యాక్సెస్, మెరుగైన విశ్లేషణలను అందిస్తోంది. డిజిటల్ మార్కెటింగ్‌లో సోషల్ మీడియా, కంటెంట్ ప్లానింగ్, ఎస్ఈవో, అనలిటిక్స్ వంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటర్ తరువాత డిజిటల్ మార్కెటింగ్‌ను కెరీర్‌గా సెలక్ట్ చేసుకుంటే జీవితంలో మంచి పొజిషన్‌లో స్థిరపడవచ్చు.

ఇది కూడా చదవండి : విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో ఆ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా.. అధికారిక ప్రకటన విడుదల

* వీడియో ఎడిటింగ్

వీడియో ఎడిటింగ్ చేసేవారిని వీడియో ఎడిటర్స్ అంటారు. సినీ, మీడియా రంగాల్లో వీడియో ఎడిటర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కళాత్మక నెపుణ్యంతో టెక్నాలజీని ఉపయోగించి వీడియోలను ఎఫెక్టివ్ గా చూపించడం వీరి ప్రధాన బాధ్యత. వీడియో ఎడిటింగ్‌లో మంచి స్కిల్స్ పెంపొందించుకుంటే వివిధ రకాల ఎడిటింగ్ ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రధానంగా కంటెంట్ డెవలపర్స్, ఫిల్మ్ ఎడిటర్స్, వీడియో కంటెంట్ డెవలపర్స్, మల్టీమీడియా డిజైనర్స్, బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్స్, యానిమేటర్స్ వంటి జాబ్ రోల్స్‌లో కెరీర్ కొనసాగించవచ్చు. వీడియో ఎడిటింగ్‌పై అనేక కోర్సులు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫిల్మ్ ఎడిటింగ్‌లో సర్టిఫికేట్ కోర్సు కూడా చేయవచ్చు. వీడియో ఎడిటింగ్‌లో స్కిల్స్, పనితీరు ఆధారంగా జీతం ఉంటుంది.

First published:

Tags: Career and Courses, Career opportunities, EDUCATION, Inter exams, JOBS

ఉత్తమ కథలు