ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే.. ఇందులో జాబ్స్ చేయడానికి పోటీపడుతున్న ఉద్యోగులు

ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడేది ఏ కంపెనీలో సోషల్ మీడియా నెట్‌వర్క్ సంస్థ లింక్డ్ ఇన్ తెలిపింది. ‘2019 టాప్ కంపెనీస్ లిస్ట్ ఫర్ ఇండియా’ ఫోర్త్ ఎడిషన్‌లో కంపెనీల పేర్లను వెల్లడించింది.

Amala Ravula | news18-telugu
Updated: April 8, 2019, 10:10 AM IST
ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే.. ఇందులో జాబ్స్ చేయడానికి పోటీపడుతున్న ఉద్యోగులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాల్‌మార్ట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో జాబ్ చేసేందుకు భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేలింది. తర్వాతి స్థానాల్లో అమెజాన్ ఇండియా, ఓయో ఉన్నాయి. ఇండియాలో ఉద్యోగులు ఏ కంపెనీల్లో జాబ్ చేసేందుకు ఇష్టపడుతున్నారనే విషయంపై సోషల్ మీడియా నెట్‌వర్క్ సంస్థ లింక్డ్ ఇన్ ‘2019 టాప్ కంపెనీస్ లిస్ట్ ఫర్ ఇండియా ’పేరిట జాబితా విడుదల చేసింది. అందులో తొలి 10 స్థానాల్లో ఇంటర్నెట్ కంపెనీల ఆధిపత్యం ఉంది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 7వ స్థానంలో ఉంది.
ఉద్యోగులు ఇష్టపడే మొదటి 10 కంపెనీలు వరుసగా, ఫ్లిప్ కార్ట్ (1), అమెజాన్ (2), ఓయో (3), పేటీఎం (4), ఉబర్ (5), స్విగ్గీ (6), టీసీఎస్(7), జొమాటో (8), ఆల్ఫాబెట్ (9), రిలయన్స్ ఇండస్ట్రీస్ (10)వ స్థానాల్లో ఉన్నాయి.


ఇంటర్నెట్, వినియోగదారు సంస్థలైన స్విగ్గీ, జొమాటో 6, 8 స్థానాలు పొందాయి. ఉబర్ 5 వస్థానంలో ఉంది. వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం) 4 వస్థానంలో ఉండగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 10వ స్థానంలో ఉన్నాయి. ఇక బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) 13వ స్థానం, ఎస్ బ్యాంక్(14), ఐబీఎం (15), దైమ్లర్ ఏజీ (16), ఫ్రెష్ వర్క్స్(17), యాక్సెంచర్ (18), ఓలా (19), ఐసీఐసీఐ బ్యాంక్ (20), పీడబ్ల్యూసీ ఇండియా (21), కేపీఎంజీ ఇండియా (22), ఎల్ అండ్ టీ(23), ఒరకల్ (24), క్వాల్‌కామ్(25) స్థానాల్లో ఉన్నాయి.
ఇక ఈ లిస్ట్‌లో సగం కంపెనీలు ఈ సారే చోటు దక్కించుకున్నాయి. యువనిపుణులను ఆకర్షించడం వల్లే సంస్థల్లో జాబితాలో చోటు దక్కించుకున్నాయని లింక్డ్ ఇన్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ ఆదిత్ చార్లి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ESIC Jobs : ESICలో 2,258 జాబ్స్.. పూర్తి వివరాలు ఇవే..
First published: April 8, 2019, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading