Chromebooks: మీ పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం బెస్ట్ డివైజ్ వెతుకుతున్నారా..? మీ బడ్జెట్ లో బెస్ట్ క్రోమ్ బుక్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి కారణంగా విద్యాబోధన అంతా ఆన్లైన్లోనే కొనసాగుతోంది. దీంతో, ఆన్లైన్ క్లాసులకు (Online Classes) అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా విద్యాబోధన అంతా ఆన్ లైన్లోనే కొనసాగుతోంది. దీంతో, ఆన్ లైన్ క్లాసులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే, మిగతా డివైజెస్ తో పోలిస్తే బడ్జెట్ ధరలోనే లభించే క్రోమ్‌ బుక్స్ మీ పిల్లల ఆన్ లైన్ క్లాసులకు బాగా ఉపయోగపడతాయి. ఇవి అన్ని కంప్యూటింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా, సరసమైన ధరలోనే లభిస్తుండటం విశేషం. అంతేకాదు, వీటిని ల్యాప్‌ టాప్స్ వలే పోర్టెబుల్ డివైజ్గా కూడా వాడుకోచ్చు. మార్కెట్లో వివిధ బ్రాండ్లకు చెందిన క్రోమ్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.

లెనోవా ఐడియాప్యాడ్ డ్యూయెట్ క్రోమ్ బుక్
లెనోవా కంపెనీకి చెందిన ఐడియాప్యాడ్ డ్యూయెట్ క్రోమ్ బుక్ మీ పిల్లల ఆన్ లైన్ క్లాసులకు సరిగ్గా సరిపోతుంది. ఇది10.1-అంగుళాల FHD డిస్‌ ప్లేతో వస్తుంది. దీనిలో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ ను అందించారు. ఈ డివైజ్ ను టాబ్లెట్, నోట్‌ బుక్‌ రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది మీడియాటెక్ హీలియో P60T ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ క్రోమ్ బుక్ను రూ.26,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఇది చదవండి: సూప్స్, సలాడ్లు ఆరోగ్యకరమైనవేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి


ఆసుస్ క్రోమ్ బుక్ సెలెరాన్ డ్యూయల్ కోర్
ఆసుస్ కంపెనీకి చెందిన సెలెరాన్ డ్యూయల్ క్రోమ్బుక్ మీ పిల్లల ఆన్ లైన్ క్లాసులకు సరిగ్గా సరిపోతుంది. దీనిలో 4GB ర్యామ్/64GB స్టోరేజ్ను అందించారు. ఇది 14- అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 720p HD వెబ్‌ క్యామ్, బ్యాక్‌ లిట్ కీబోర్టును అమర్చారు. ఈ క్రోమ్ బుక్ రూ.23,999 ధర వద్ద లభిస్తుంది.

ఏసర్ క్రోమ్‌బుక్ 311
ఏసర్ క్రోమ్‌ బుక్‌లో 1366 x 768 రిజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. దీనిలో 4GB RAM, 32GB ROM, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 600 వంటివి అందించారు. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, 4GB RAM, 32GB స్టోరేజ్‌ తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్లో రూ.22,890 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

హెచ్.పి క్రోమ్బుక్ 11a
హెచ్పి క్రోమ్ బుక్ 11a.. 11.6- అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో మీడియా టెక్ MT8183 ప్రాసెసర్ను అందించారు. ఇది 4GB RAM, 64GB EMMC స్టోరేజ్ ఆప్షన్షలో లభిస్తుంది. దీనిలో 45W టైప్-సి అడాప్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, HP ట్రూ విజన్ 720p HD వెబ్‌ క్యామ్ వంటివి అందించారు. ఈ ల్యాప్‌ టాప్ను రూ.22,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఏసర్ క్రోమ్ బుక్ సెలెరాన్ డ్యూయల్ కోర్
ఏసర్ క్రోమ్‌ బుక్ 11.6-అంగుళాల హెచ్డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB RAM, 16GB స్టోరేజ్ను అందించారు. ఇది 3-సెల్ బ్యాటరీ, 45WHrs బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు, మిలిటరీ గ్రేడ్ డ్యూరబులిటీ ఫీచర్లతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్లో దీన్ని రూ.23,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

హెచ్.పీ క్రోమ్ బుక్ 14A
హెచ్.పీ క్రోమ్ బుక్ 14A.. 14 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది. ఇది 4GB RAM, 64GB SSD స్టోరేజ్‌ తో పాటు 256GB ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్‌ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌ టాప్ ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. దీన్ని ఆలైన్లో రూ.26,979 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
Published by:Purna Chandra
First published: