హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Civils Interview: సివిల్స్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు వేస్తారు?.. గతంలో అడిగిన వింత ప్రశ్నలు, వాటికి అభ్యర్థుల సమాధానాలు ఇవే!

Civils Interview: సివిల్స్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు వేస్తారు?.. గతంలో అడిగిన వింత ప్రశ్నలు, వాటికి అభ్యర్థుల సమాధానాలు ఇవే!

Civils Interview: సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరైన UPSC ఆశావహులను ఇంటర్వ్యూ ప్యానెల్ వింత ప్రశ్నలు అడిగి, వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించినట్లు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగిన వింత ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూద్దాం.

ఇంకా చదవండి ...

  భారత్‌లోని అతి కష్టమైన పరీక్షల్లో సివిల్స్ ఎగ్జామ్ (Civils Exam) ఒకటి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE) ఇంటర్వ్యూ రౌండ్, ఆల్ ఇండియా స్థాయిలో కష్టతరమైన వ్యక్తిత్వ పరీక్షలలో ఒకటని చెప్పుకోవచ్చు. జనవరి 7న ప్రారంభం కానున్న UPSC CSE మెయిన్స్ పరీక్షకు కమిషన్ అడ్మిట్ కార్డులను ఇప్పటికే విడుదల చేసింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కత్తిమీద సాము వంటిది. సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరైన UPSC ఆశావహులను ఇంటర్వ్యూ ప్యానెల్ వింత ప్రశ్నలు అడిగి, వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించినట్లు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగిన వింత ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూద్దాం.

  2020లో ఇంటర్వ్యూకి హాజరైన తాన్యా అగర్వాల్‌ను స్నూపింగ్ ప్రయోజనాల గురించి అడిగారు. దొంగచాటుగా ఇతరుల వ్యవహారాలను తెలుసుకోవడాన్ని స్నూపింగ్ అంటారు. దానికి ఆమె.. “నేను బాగా చదువుతున్నానో లేదో తెలుసుకోవడానికి మా అమ్మ నన్ను పరిశీలిస్తూ ఉండేది. ఆమె చేసిన స్నూపింగ్ ఉద్దేశాలు నా మంచి కోసమేనని నేను నమ్ముతున్నాను!" అని సమాధానమిచ్చింది. రాష్ట్రాల నిఘా, జాతీయ భద్రత, వ్యక్తిగత గోప్యత మధ్య సమతుల్యత విషయంలో కూడా ఆమె స్నూపింగ్‌ గురించి వివరించింది.

  మరో అభ్యర్థి గిరి ప్రసాద్‌ను.. గదిలో కుడి వైపున ఉన్న స్విచ్ బోర్డ్‌ను చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది? అని అడిగారు. దీనికి.. “నేను ఈ స్విచ్‌తో పైన ఉన్న లైట్లను మాత్రమే కంట్రోల్ చేయగలను కానీ నా జీవితాన్ని కాదు. మీ ప్రశ్నలాగే జీవితం కూడా క్లిష్టంగా ఉంది" అని సమాధానం ఇచ్చారు గిరి ప్రసాద్.

  * కటకం రోహన్ అనే అభ్యర్థిని UPSC- CSE ఇంటర్వ్యూ రౌండ్‌లో కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. అవేంటంటే..

  ప్రశ్న: ఆదర్శ్, అనుపమ్ అనే కవలలు మేలో జన్మించారు. కానీ వారి పుట్టినరోజు జూన్‌లో. ఇది ఎలా సాధ్యపడుతుంది?

  జవాబు: మే అనేది వారు జన్మించిన ఊరి పేరు.

  ప్ర: కాంక్రీట్ ఫ్లోర్ పగలకుండా పచ్చి గుడ్డును ఎలా వదిలేయాలి?

  జ: కాంక్రీట్ ఫ్లోర్‌ను పగలగొట్టడం చాలా కష్టం. (గుడ్డు పగలకుండా.. అని అడగడానికి బదులుగా ఫ్లోర్ పగలకుండా అని ప్రశ్న అడిగారు)

  ప్ర: సగం యాపిల్ లాగా కనిపించేది ఏంటి?

  జ: యాపిల్ పండులో మిగిలిన సగం.

  ప్ర: How can you lift an elephant with one hand? (ఒక చేయితో ఏనుగును ఎత్తడం.. అనే అర్థానికి బదులుగా ఒక చెయ్యి ఉండే ఏనుగును ఎత్తడం అనే అర్థం వచ్చేలా ప్రశ్న వేశారు.

  జ: ఒక చెయ్యి ఉండే ఏనుగులు మనకు దొరకవని అభ్యర్థి సమాధానం ఇచ్చారు.

  ఇలా అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాలతో పాటు అన్ని రకాల స్కిల్స్‌ను గుర్తించేలా ఇంటర్వ్యూ బోర్డు ప్రశ్నలు అడుగుతుంది. రాత పరీక్షలో మెరిట్‌లో ఉన్నంత మాత్రన విజయం సాధించినట్లు కాదని, అభ్యర్థులు ఎన్నో అంశాల్లో నిష్ణాతులుగా ఉండాలని ఇలాంటి ప్రశ్నలు సూచిస్తున్నాయి.

  First published:

  Tags: Civil Services, Exams, Special interview, UPSC, VIRAL NEWS

  ఉత్తమ కథలు