Bipc తర్వాత MBBS కాకుండా ఈ కోర్సులు కూడా చేయొచ్చు

ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నవారు.. ఆ తర్వాత ఎంబీబీఎస్ చేస్తేనే చాలా అవకాశాలుంటాయనుకుంటారు. కానీ, అందుకే చాలామంది ఎంసెట్ అంటూ కోచింగ్‌లకి వెళ్తుంటారు. అలా కాకుండా వేరే కోర్సులు చేయడం వల్ల కూడా మంచి కెరీర్ ఉంటుంది. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 4:48 PM IST
Bipc తర్వాత MBBS కాకుండా ఈ కోర్సులు కూడా చేయొచ్చు
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 4:48 PM IST
బైపీసీ తీసుకున్నవారు.. ఎంబీబీఎస్ కోర్సుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇందులో సీటు రాకపోతే.. డిగ్రీలో ఏదో ఓ కోర్సులో చేరుతారు. అలా కాకుండా.. ప్రజెంట్ హోమియోపతి, ఆయుర్వేదంలపై కూడా ప్రజలకు అవగాహన పెరిగింది కాబట్టి.. బైపీసీ స్టూడెంట్స్ అటూ వైపు వెళ్లొచ్చు. అందుకోసం..బీహెచ్ఎంఎస్(బ్యాచిలర్స్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బీఏఎంఎస్(బ్యాచిలర్స్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ) కోర్సులు చేయొచ్చు. ఇవి పూర్తయ్యాక ఎన్నో అవకాశాలున్నాయి.
కేవలం ఆకోర్సులే కాకుండా ఫోరెన్సిక్ సైన్స్, టెక్స్‌టైల్, ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, అగ్రికల్చర్, నర్సింగ్ ఇలాంటి కోర్సులు కూడా ఎంచుకోవచ్చు. వీటన్నింటికి షంవత్సరంలో ఓ సారి అడ్మిషన్లు ఉంటాయి. కొన్ని కాలేజీల్లో ఈ కోర్సుల కోసం ఎంట్రెన్స్ టెస్ట్ లేకుండానే అవకాశం ఇస్తారు. వీటితో పాటు బీఏ టూరిజం, బీబీఏ ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు కూడా ఎంచుకోవచ్చు.
అయితే, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి విషయం ఒకటే.. అన్నీ ప్రామాణాలు కలిగిన.. మెరుగైన కాలేజీల్లో చేరితేనే మంచి అవకాశాలుంటాయని అర్థం చేసుకోవాలి. కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకునేముందు ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేయడం మంచిది.

First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...