రోజుకో కొత్త టెక్నాలజీ (New Technology) వస్తున్న తరుణంలో వివిధ రంగాల్లో నిపుణుల అవసరం ఎంతో ఉంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇలాంటి అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించడానికి ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉండటంతో పాటు, వారిలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేలా అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న స్టైఫండ్ వివరాలు తెలుసుకోండి.
* CF స్పార్కిల్ ఇన్‌క్లూజివ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సీఎఫ్ స్పార్కిల్ ఇన్‌క్లూజివ్ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. బాలికలు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా STEAM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మ్యాథ్) కోర్సులలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మొదటి సంవత్సరం లేదా వృత్తి సాంకేతిక విద్య (VTE), పారామెడికల్ సైన్సెస్, హెల్త్ సైన్స్ సబ్జెక్టుల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా చదువుతూ ఉండాలి. ఇంటర్ లేదా 12వ తరగతి పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదు. భారతీయ విద్యార్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాగ్నిజెంట్, కాగ్నిజెంట్ ఫౌండేషన్, Buddy4Study ఉద్యోగుల పిల్లలు అప్లై చేసుకునేందుకు అర్హులు కాదు. ఏడాదికి రూ.75 వేలు ఇస్తారు. మార్చి 15లోగా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం www.b4s.in/it/CFSI1 పోర్టల్ విజిట్ చేయవచ్చు.
* NETAPS ఫౌండేషన్
NETAPS ఫౌండేషన్ అనేది విద్యారంగంపై సేవలు అందిస్తున్న ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ. ఇక్కడివారితో పాటు విదేశాల్లో ఉండే విద్యార్థులకు సేవలు అందిస్తోంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అనుసంధానంగా తన సేవలను కొనసాగిస్తోంది. గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు NETAPS ఫౌండేషన్ – లీడ్ జనరేషన్ ఎగ్జిక్యూటీవ్ ఇంటర్న్‌షిప్ 2023లో అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు దీనికి అర్హులు. ఆరునెలల పాటు తప్పనిసరిగా పనిచేయాలి. నెలకు రూ. 10,000 ఇవ్వడంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://internship.aicte-india.org/internship-details.php?uid=INTERNSHIP_167292116763b6c04fd0122 పోర్టల్ చెక్ చేయవచ్చు.
* అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్
ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (INAE) అనేది నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఫెలోషిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంజినీరింగ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ డెవలప్‌మెంట్ అంశాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్ 2023-24ను నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి : పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్! డౌన్‌లోడ్ చేసుకోండిలా..
భారత్‌లో ఉన్న లేదా విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు దీనికి అప్లై చేసుకోవచ్చు. కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. మాతృ సంస్థలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఇతర ఫెలోషిప్‌లు ఉండకూడదు. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.25,000 స్టైఫండ్‌తో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. inaehq@inae.in అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు https://www.inae.in/research-innovation/abdul-kalam-technology-innovation-national-fellowship/ సైట్ ఫాలో కావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Internship, JOBS, Scholarship