ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలోని అనేక సంస్థలు ఇంటర్న్‌షిప్ (Internship)కు అవకాశం కల్పిస్తున్నాయి. సంబంధిత రంగంలో ఉద్యోగంలో చేరడానికి కంటే ముందు కొంత ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. పైగా ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా ఉద్యోగాన్ని ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రాఫిక్ డిజైన్ రంగంలో మంచి ఉద్యోగవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్‌గా ఆలోచించే వారికి ఈ రంగం బాగా సెట్ అవుతుంది. గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారి కోసం కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. అవేంటంటే..
* NYKAA- బెంగళూరు
దేశంలోని అతిపెద్ద ఇ-కామర్స్ బ్యూటీ రిటైలర్స్‌లో Nykaa ఒకటి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, మూడు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా ఫిబ్రవరి మూడులోపు అప్లై చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు గ్రాఫిక్ డిజైనింగ్ పోస్టర్లను డిజైన్ చేయడం, బిజినెస్ అనాలసిస్‌పై వర్క్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.5000 స్టైఫండ్ ఇవ్వనున్నారు.
* బజాజ్ క్యాపిటల్-గుర్గావ్
గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న బజాజ్ క్యాపిటల్ గ్రాఫిక్ డిజైన్‌పై మూడు నెలల ఇంటర్న్‌షిప్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా ఫిబ్రవరి 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. మార్కెటింగ్ మెటీరియల్స్, సోషల్ మీడియా గ్రాఫిక్స్, వెబ్ గ్రాఫిక్స్ సహా వివిధ రకాల విజువల్ మెటీరియల్స్ డిజైన్ చేయడానికి డిజైనర్ల టీమ్‌తో ఎంపికైన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.10,000 స్టైఫండ్ కూడా లభిస్తుంది.
* పెప్పర్మింట్ కమ్యూనికేషన్స్
ఈ సంస్థ రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. క్యాంపెయిన్ కోసం మార్కెటింగ్ అవసరాలను రూపొందించడానికి డిజిటల్ మార్కెటింగ్ టీమ్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా జనవరి 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12000 స్టైఫండ్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రూ.50వేల స్కాలర్షిప్.. అర్హతలు ఇవే..
* PVR లిమిటెడ్ - గుర్గావ్
గుర్గావ్లోని మరో కంపెనీ PVR లిమిటెడ్ కూడా గ్రాఫిక్ డిజైన్‌పై ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల ఈ ప్రోగ్రామ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా ఫిబ్రవరి మూడులోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు CMS సపోర్ట్‌పై వర్క్ చేయనున్నారు. అలాగే సినిమా పోస్టర్ సైజ్‌లో మార్పులు, వెబ్ లేదా యాప్‌లో ట్రైలర్‌ను అప్డేట్ చేయడం వంటి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌లకు నెలకు రూ.15000 స్టైఫండ్ లభిస్తుంది.
* ఫ్యాషన్ టీవీ ఇండియా- పూణే
ఈ సంస్థ గ్రాఫిక్ డిజైన్‌పై ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా ఫిబ్రవరి 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2000 స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు. ఫ్యాషన్ ఫొటోగ్రాఫ్‌లను ఎడిట్ చేయడం అభ్యర్థుల ప్రధాన డ్యూటీ. అంతేకాకుండా ప్రొఫెషనల్ ఫొటోగ్రాపర్స్‌కు అసిస్టెంట్ గా పనిచేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Internship, JOBS