కొన్ని సంవత్సరాలుగా డేటా సైన్స్ (Data Science) రంగానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. డేటా సైంటిస్ట్ (Data Scientist) అనేది డేటాను విశ్లేషించే ప్రొఫెషనల్. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు, పరిశోధన సంస్థల్లో వీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. డేటా విజువలైజేషన్, ఎనలిటిక్స్, కోడింగ్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ వంటి వాటి ఆధారంగా డేటాను వీరు విశ్లేషిస్తారు. ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉండటం, అవకాశాలు, మంచి జీతం ఉండటంతో ఇటువైపు వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది.
డేటాసైన్స్‌లో మంచి ఫ్యూచర్ కావాలనుకునే ఫ్రెషర్లు.. ఇంటర్న్‌షిప్ చేయడం మంచిది. దీని వల్ల జాబ్ నాలెడ్జ్ రావడంతో పాటు, మంచి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు డేటా సైన్స్‌లో ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ నెలలో కొన్ని కంపెనీలు ఇంటర్న్‌లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
* బ్రేవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీ
బ్రేవ్ AI ల్యాబొరేటరీ మూడు నెలల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఇచ్చింది. మార్చి 24లోగా దీనికి అప్లై చేసుకోవాలి. వ్యాపార నిర్ణయాలకు అనుగుణంగా డేటాసెట్స్‌ను విశ్లేషించాలి. డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.10,000 స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షాలా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* FITTLYF
ఫిట్లీఫ్ (FITTLYF)లో నాలుగు నెలలకు ఇంటర్న్‌లను ఆహ్వానిస్తున్నారు. ఆపరేషనల్ స్టాటిస్టకల్స్ టూల్స్, మోడల్స్ మీద పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.3,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఇంటర్న్‌షాలా ద్వారా అప్లై చేసుకోవచ్చు. మార్చి 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : సీయూఈటీ అభ్యర్థులకు అలర్ట్.. కోర్సుల ఎంపికకు ముందు సిలబస్ తెలుసుకోండి..!
* OVERDOSE AI
ఓవర్ డోస్ (OVERDOSE) AIలో అయిదు నెలల ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఇంటర్న్‌షాలాలో మార్చి 23లోగా అప్లై చేసుకోవాలి. ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉంది. ఇంటర్న్‌లు డేటా సైన్స్ ప్రాజెక్టులు, అనలిటిక్స్‌పై పనిచేస్తారు. ML మోడల్స్, టైం సిరీస్, న్యూరల్ నెట్స్ తదితర వాటిపై పనిచేయాల్సి ఉంటుంది. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.5,000 నుంచి రూ.12,000 వరకు స్టైఫండ్ ఇస్తారు.
* క్రాఫ్టీ టాక్
క్రాఫ్టీ టాక్‌లో నెలపాటు ఇంటర్న్‌షిప్ ఆఫర్ అనౌన్స్ చేసింది. మార్చి 23లోగా ఇంటర్న్‌షాలా వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇంటి నుంచే పని చేయొచ్చు. సెలక్ట్ అయిన వారు దేశంలోని ఇతర ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000 స్టైఫండ్ ఇస్తారు.
* UniAcco
UniAcco అనే సంస్థ అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకోవాలని అనుకునే విద్యార్థులకు అకామొడేషన్ వివరాలు చూపించే ఢిల్లీ బేస్డ్ వెబ్‌పోర్టల్. ఈ మూడునెలల ఇంటర్న్‌షిప్‌కు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా మార్చి 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్స్ డేటాలో లోపాలు, సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించాలి. నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు స్టైఫండ్ ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Data science, EDUCATION, Internship, JOBS