Home /News /jobs /

HEALTH SCIENCE COURSES MUHS SUMMER INTERNSHIP PROGRAMME FOR UG STUDENTS FULL DETAILS HERE GH VB

MUHS: వైద్య విద్యలో పరిశోధనే లక్ష్యమా...? అయితే ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ట్రై చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వైద్య విద్య అనంతరం పరిశోధనా రంగం వైపు అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థులకు మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే..

వైద్య విద్య అనంతరం పరిశోధనా రంగం వైపు అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థులకు మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) గుడ్ న్యూస్ చెప్పింది. విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో హెల్త్ సైన్స్ కోర్సు(Health Science Course) చదువుతున్న విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (SIP) అందించనున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా పరిశోధనా రంగంలో ఆసక్తిగల విద్యార్థులకు విస్తృత అవకాశాలను అందించడమే ఈ కోర్సు(Course) లక్ష్యమని పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ (Under Graduate) మూడో సంవత్సరం విద్యార్థుల ఈ కోర్సులో జాయిన్(Join) అవ్వొచ్చని తెలిపింది. ఎపిడెమియాలజీ, క్లినికల్ రీసెర్చ్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, సైకియాట్రిక్ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందించే చికిత్స, ప్రత్యామ్నాయ వైద్యం విభాగంలో 180 సీట్లను కేటాయించింది.

Petrol Diesel: షాకింగ్ లెక్కలు -మూడేళ్ల గరిష్టానికి ఇంధన డిమాండ్ -పెట్రోల్ అమ్మకాల రికార్డు


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (SIP) కేంద్రాల ద్వారా ఈ కోర్సును అందించనుంది. ఈ లిస్ట్ లో ఆసుపత్రులు, పరిశోధన, పునరావాస కేంద్రాలు, మెడికల్ తయారీ యూనిట్లు, ఆరోగ్య రంగంలోని వివిధ రకాల సంస్థలు ఉన్నాయి. వైద్య విద్యార్థులు వేసవి సెలవుల్లో అదనపు జ్ఞానాన్ని పెంచుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ కోర్సు లక్ష్యమని మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) తన నోటిఫికేషన్ లో పేర్కొంది. విభిన్న సంస్కృతి, సాంప్రదాయ పద్ధతులను తెలుసుకోవడం సహా.. ప్రజారోగ్యంలో వచ్చే మార్పులను అర్థం చేసుకునేందుకు SIP ఒక వేదిక అవుతుందని కూడా తెలిపింది. ఈ మేరకు అడ్మిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ లో పాల్గొనబోయే అభ్యర్థులు సీనియర్ ఫ్యాకల్టీతో కలిసి పని చేస్తారు. క్లాస్ రూం థియరీతో పాటు వైద్య శాస్త్రంలో వస్తున్న విభిన్న అప్లికేషన్లను పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది.

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) తెలిపింది. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరగనుంది. దీనికిగాను అభ్యర్థి యొక్క స్టడీస్, ఇతర ఇంట్రెస్ట్ లను వర్సిటీ అంచనా వేయనుంది. నాలుగు వారాల పాటు సాగే ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో 2500 రూపాయల స్టైఫండ్ సైతం అందించనున్నట్లు MUHS తెలిపింది. కోర్సు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

Russia-Ukraine War: ఇటు ఏ మాత్రం తగ్గని రష్యా.. అటు ఉక్రెయిన్ కు ఫ్రాన్స్‌, ఇటలీ అండగా ఇలా..

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యతో అక్కడ విద్య విద్య చదువుతూ భారత్ కు తిరిగి వచ్చిన వారికి మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) ఉచిత ఈ-లెర్నింగ్ మెడికల్ కోర్సును ప్రారంభించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ఈ తరహా ప్రోగ్రామ్ ను ప్రారంభించిన దేశంలోనే తొలి వైద్య విద్యా విశ్వవిద్యాలయం MUHS అని డాక్టర్ చవాన్ తెలిపారు. అభ్యర్థులంతా ఈ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారాయన. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 900 మంది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Health science, Internship, Under graduation

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు