HEALTH DEPARTMENT JOBS LERT FOR THE UNEMPLOYED NOTIFICATION ISSUED IN DEPARTMENT WITH 1326 POSTS KNOW DETAILS EVK
TS Govt Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 1,326 పోస్టులతో ఆ శాఖలో నోటిఫికేషన్ విడుదల
(ఫ్రతీకాత్మక చిత్రం)
Ts Health Department Jobs 2022 | తెలంగాణలో వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే, పోలీస్, గ్రూప్-1 నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి. వాటి దరఖాస్తు ప్రక్రియ పూర్తయంది.. ఈ సమయంలో తాజాగా నిరుద్యోగులకు మరో భారీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే, పోలీస్, గ్రూప్-1 నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి. వాటి దరఖాస్తు ప్రక్రియ పూర్తయంది.. ఈ సమయంలో తాజాగా నిరుద్యోగులకు మరో భారీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖ (Health Department)లో భారీగా 1,326 సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ 15.7.2022 నుంచి 14.8.2022 వరకు కొనసాగుతుంది.
పోస్టుల వివరాలు..
పోస్టు
ఖాళీలు
వేతనం
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పబ్లిక్ హెల్త్)
751
రూ.58,850-
రూ.1,37,050
ట్యూటర్
357
రూ.57,700-
రూ.1,82,400 (UGC
Scales-2016)
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (వైద్య విధాన పరిషత్)
211
రూ.58,850-
రూ.1,37,050
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ప్రివెంటీవ్ మెడిసిన్
07
రూ.58,850-
రూ.1,37,050
విద్యార్హత
దరఖాస్తు చేసుకొనే అభ్యర్తులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.
ఇటీవలే మంత్రి హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖ (Health Department)లో భారీగా 1,326 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సం బం ధిత అధికారులతో మం త్రి సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి , డీఎం ఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, ఇతర ఉన్న తాధికారులతో మం త్రి సమీక్షిం చారు. పలు విభాగాల నుంచి ఖాళీల సమాచారం సేకరించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.